బిజినెస్

మూడు మేజర్ పోర్టుల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమిలి సమీపంలో ఫిషింగ్ హార్బర్
అంతర్జాతీయ సంస్థల సహకారంతో ఆక్వా మార్కెటింగ్
గుజరాత్‌లోని తెలుగు మత్స్యకారులకు ఏపీలో పునరావాసం
పశు సంవర్థక, మత్స్యశాఖల సమీక్షలో ముఖ్యమంత్రి జగన్

అమరావతి, సెప్టెంబర్ 20: రాష్ట్రంలో మూడు మేజర్ పోర్టుల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. మచిలీపట్నం పోర్టును మేజర్ పోర్టుగా అభివృద్ధి చేయాలన్నారు. పశు సంవర్థక, మత్స్యశాఖల అధికారులతో శుక్రవారం ముఖ్యమంత్రి సమీక్షించారు. భీమిలి సమీపంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణంపై సమావేశంలో చర్చించారు. శ్రీకాకుళం జిల్లా మంచినీళ్లపేటతో సహా రాష్ట్రంలో గుర్తించిన ప్రాంతాల్లో జెట్టీల నిర్మాణంపై సీఎం సమీక్షించారు. వీటిని ప్రణాళికా బద్ధంగా పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించాలన్నారు. సుమారు 12 జెట్టీల నిర్మాణానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. విశాఖ ఫిషింగ్ హార్బర్‌పై ఒత్తిడి తగ్గించాల్సి ఉందనే విషయం సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ఇందుకు తగిన ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మత్స్యకారుల గురించి ఈ ప్రభుత్వం పట్టించుకోవటంలేదనే సంకేతాలను తొలగించాలన్నారు. ఇందుకోసం వారు కోరుతున్న ప్రాంతాల్లో జెట్టీలు, ఫిషింగ్ హార్బర్‌ల నిర్మాణాలు చేపట్టాలన్నారు. ఈ పనుల్లో పారదర్శకత ఉండేలా చూడాలన్నారు. అవినీతికి తావులేకుండా జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు. గుజరాత్‌లో 25 వేల తెలుగు మత్స్యకార కుటుంబాలు ఉన్నాయని, ఉపాధిలేక వారు వలస వెళ్లారని అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. వేటకు అవసరమైన సదుపాయాలు కల్పించడం ద్వారా వారిని తిరిగి రాష్ట్రానికి రప్పించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించాలని సీఎం సూచించారు. చేపలు, రొయ్యలు పెంచుతున్న ప్రాంతాల్లో ల్యాబ్‌లు, రైతులకు అవగాహన శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. వచ్చే ఏడాది జనవరి నాటికి వీటిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సీడ్, ఫీడ్‌లో కచ్చితంగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు. కల్తీ అనేది ఉండరాదన్నారు. ఆక్వా ప్రాంతాల్లోని గ్రామ సచివాలయాల్లో సంబంధిత రంగానికి చెందిన వారిని ఉద్యోగులుగా తీసుకున్నారని, వారికి సరైన శిక్షణ ఇచ్చి రైతులకు మేలు జరిగేలా చూడాలని అధికారులకు నిర్దేశించారు. తూర్పుగోదావరి జిల్లాలో హేచరీజోన్‌గా ప్రకటించిన ప్రాంతంలో ఫార్మా కంపెనీకి కూడా అనుమతిచ్చారని దీనివల్ల కాలుష్యం అంతా సముద్రంలో కలుస్తుందని ఇదే ప్రాంతంలో తాను పాదయాత్ర చేసినట్లు ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఒక ప్రాంతాన్ని ఫలానా జోన్‌గా ప్రకటించిన తరువాత అక్కడ వేరే పరిశ్రమలకు అనుమతివ్వడం, కలుషితం చేయటం మంచి పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు. దీనిపై పూర్తిగా ఆధ్యయనం చేసి ఒక విధానాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆక్వా పంట చేతికి వచ్చే సరికి ధరలు పడిపోయిన సందర్భాలనేకం ఉన్నాయని, ఇది ఓ పెద్ద సవాల్‌గా చెప్పారు. ఎంత కష్టపడినా గిట్టుబాటుధర రావటం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారని, ప్రముఖ అంతర్జాతీయ సంస్థల సహకారం తీసుకుని వారు ఇక్కడి రకాలను వినియోగించేలా ప్రణాళికలు తీసుకురావాలని సూచించారు. మేనేజ్‌మెంట్‌లో ప్రతిభావంతుల సహకారం తీసుకోవాలన్నారు. దీనివల్ల మార్కెటింగ్ సదుపాయాలు పెరుగుతాయని చెప్పారు. జనవరిని రిక్రూట్‌మెంట్ నెలగా నిర్దేశించుకుని ఖాళీలను భర్తీ చేయాలన్నారు. వెటర్నరీ ఆస్పత్రులు, క్లినిక్‌లలో సదుపాయాలను కల్పించాలన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థను ఇందుకు వినియోగించాలని సూచించారు. పశువులకూ హెల్త్‌కార్డులు మంజూరు చేయాలని దీనివల్ల క్రమం తప్పకుండా వ్యాక్సిన్
వేసే అవకాశం ఉంటుందన్నారు. పశువుల పెంపకంలో సాంప్రదాయ పద్ధతులకు పెద్దపీట వేయాలన్నారు. ఏ కార్యక్రమం చేపట్టినా అందులో వలంటీర్లను భాగస్వాములు చేయాలని ఆదేశించారు. పశువుల మందుల కొనుగోలులో ప్రపంచ స్థాయి ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు. ఏపీ కార్ల్‌కు నేరుగా వీటిని తెప్పించుకునేలా నీటిపారుదలశాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని దీనివల్ల పరిశోధనలకు కూడా ఇబ్బంది ఉండదని వివరించారు. ఏపీ కార్ల్‌ను లక్ష్యాలకు అనుగుణంగా నడపాలని సూచించారు. పులివెందులలో ముర్రా గేదెలు, పుంగనూరు జాతి ఆవుల అభివృద్ధి కోసం బ్రీడింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. కరవు బాధిత ప్రాంతాల్లో పశువులకు ఆహార కొరత లేకుండా స్థిరమైన విధానాలను అమల్లోకి తీసుకురావాలన్నారు. దాణా కొరత లేకుండా ఉత్తమ విధానాలను అనుసరించాలన్నారు. పశు వైద్యం కోసం 102 వాహనాలు వచ్చే ఏడాది నుంచి ప్రవేశపెట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు సమావేశానికి మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.