బిజినెస్

కార్పొరేట్ పన్ను తగ్గింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజీ, సెప్టెంబర్ 20: కార్పొరేట్ పన్నులను భారీగా తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఉదయం సంచలన నిర్ణయం తీసుకుంది. తగ్గించిన రేట్ల ప్రకారం కార్పొరేట్ పన్నులు 25.17 శాతంగా ఖాయం అవుతాయి. ఈ నిర్ణయం ద్వారా కార్పొరేట్ రంగానికి 1.45 లక్షల కోట్ల రూపాయల మేర లాభం చేకూరుతుంది. పన్ను తగ్గింపుపై అవసరమైన చట్ట సవరణలు కూడా చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇక్కడ జరిగిన విలేఖరుల సమావేశంలో ప్రకటించారు. దేశ స్థూల ఉత్పత్తి గత ఆరేళ్లకాలంలో ఎన్నడూ లేని రీతిలో 5 శాతానికి పతనమైన విషయం తెలిసిందే. దేశంలో నిరుద్యోగితా శాతం 45 సంవత్సరాల గరిష్టానికి చేరింది. ఈ పరిస్థితుల్లో దేశంలో ఆర్థిక మాంద్య పరిస్థితులు నెలకొన్నాయి. వృద్ధిరేటు కూడా దారుణంగా పడిపోవడం ఖాయంగా కనిపిస్తున్నది. ముంచుకొస్తున్న ప్రమాదాన్ని గుర్తించిన కేంద్రం ఇప్పటికే మూడు వితడలుగా ఉద్దీపన చర్యలు ప్రకటనలు చేసింది. పలు జాతీయ బ్యాంకుల విలీనం, గృహ, నిర్మాణ రంగాలకు భారీ ప్యాకేజీ వంటి సరికొత్త విధానాలతో ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అదే క్రమంలో కార్పొరేట్ పన్నులను తగ్గించి, అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేశారు.
గట్టిపోటీనిస్తాం
ప్రపంచ దేశాలకు, ప్రత్యేకించి ఆసియా దేశాలకు దీటైన పోటీని ఇవ్వగలుగుతామని, కార్పొటరేట్ పన్నుల తగ్గింపే ఇందుకు అవసరమైన ఊతాన్ని ఇస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కార్పొరేట్ పన్నులు ఇప్పుడు జపాన్, దక్షిణ కొరియా, చైనా వంటి దేశాలతో సరిసమానంగా ఉన్నాయని అన్నారు. దేశీయ కంపెనీలు భారీగా లాభపడతాయని, తద్వారా ప్రధాని ఆశయం ‘మేక్ ఇన్ ఇండియా’కు మరింత ఊపు వస్తుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ నిర్ణయం అక్టోబర్ ఒకటో
తేదీ నుంచి అమల్లోకి వస్తుందని, 2023 మార్చి 31వ తేదీలోగా నమోదయ్యే కంపెనీలకు మాత్రమే ఇది వరిస్తుందని తెలిపారు. కార్పొరేట్ పన్ను ప్రస్తుతం 34.94 శాతంకాగా, ఇది 25.17 శాతానికి పడిపోతుందని వివరించారు. త్వరోనే పన్నుల విధానాన్ని మారుస్తామని ఆమె ప్రకటించారు. ఆర్థిక వ్యవస్థ మెరుగుకు కేంద్ర సర్కారు విశేషంగా కృషి చేస్తున్నదని ఆమె పేర్కొన్నారు.