బిజినెస్

‘సత్యం’ సంస్థలకు రూ. 6.20 కోట్లను చెల్లించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 3: సత్యం కంప్యూటర్ సర్వీసెస్‌కు 6.20 కోట్ల రూపాయల సొమ్మును చెల్లించాలని కేంద్ర మంత్రి సుజనా చౌదరికి చెందిన సుజన గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌ను నాంపల్లి పదవ అదనపు సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి శనివారం ఆదేశించారు. ఈ మేరకు మూడు డిక్రీలను కోర్టు జారీ చేసింది. ఫిన్సిటీ ఇనె్వస్ట్‌మెంట్స్, హైగ్రేస్ ఇనె్వస్ట్‌మెంట్స్, ఏలెమ్ ఇన్విస్టిమెంట్స్ సంస్థలు కోర్టులో మూడు దావాలను దాఖలు చేశాయి. సుజన క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్‌కు తాము ఐదు రుణాలు మంజూరు చేశామని పేర్కొన్నాయి. ఈ రుణాలకు కేంద్ర మంత్రిగా ఉన్న వైఎస్ చౌదరి, డైరెక్టర్ ఆర్ దేవందర్ రెడ్డి గ్యారంటీగా ఉన్నారని దావాలో తెలిపాయ. ఈ రుణాలను 1999లో ఈ సంస్థలకు ఇచ్చామన్నాయ. కాగా, రుణాలు చెల్లించడంలో విఫలమైనందున 2003లో ఈ సంస్థలు దావాలు దాఖలు చేశాయి. మరోవైపు తమకు రుణాలు ఇచ్చిన సంస్థలు సొమ్మును బదలాయించేందుకు తమను ఉపయోగించుకున్నాయని సుజనా గ్రూపు కోర్టుకు తెలిపింది. అయతే కోర్టు ఈ కేసును విచారించి వచ్చే 17 సంవత్సరాల్లోగా 18 నుంచి 24 శాతం చొప్పున వడ్డీతో రూ. 6.20 కోట్లను సత్యం కంప్యూటర్ సర్వీసెస్‌కు చెందిన సంస్థలకు చెల్లించాలని సుజన సంస్థలను కోర్టు ఆదేశించింది. వడ్డీతో కలిపి మొత్తం రూ. 17 కోట్లను సుజన గ్రూపు చెల్లించాల్సి ఉంటుందని సత్యం సంస్థల న్యాయవాది తెలిపారు.