బిజినెస్

మార్కెట్లకు ‘జియో’ సెగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 1: కొత్తగా టెలికాం సేవల రంగంలోకి అడగుపెట్టిన రిలయన్స్ సంస్థ తన చౌక ధరల జియో టారిఫ్‌లను ప్రకటించిన నేపథ్యంలో గత మూడు రోజులుగా లాభాల బాటలో సాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఆరంభంలో కొనుగోళ్ల మద్దతుతో మంచి లాభాలే ఆర్జించిన ప్రధాన సూచీలు జియో టారిఫ్‌ల ప్రకటనల తర్వాత ఎయిర్‌టెల్, ఐడియా లాంటి ప్రధాన టెలికాం సంస్థల షేర్లన్నీ భారీగా పతనం కావడంతో చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. నిన్నటి ముగింపుకన్నా పైస్థాయిలో 28,459 పాయింట్ల వద్ద ప్రారంభమైన బిఎస్‌ఇ సెనె్సక్స్ ఆ తర్వాత కొనుగోళ్ల మద్దతుతో ఒక దశలో 28,548.85 పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకింది. అయితే ఆ తర్వాత టెలికాం షేర్లలో భారీ అమ్మకాల కారణంగా పతనమై 28,386.61 పాయింట్ల స్థాయికి పడిపోయినా చివరికి 28.69 పాయింట్ల నష్టంతో 28,423.48 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం ఇదే రీతిలో సాగి చివరికి 11.55 పాయింట్ల నష్టంతో 8,774.65 పాయింట్ల వద్ద ముగిసింది. ఐడియా సెల్యులార్ షేరు 10 శాతానికి పైగా నష్టపోగా, భారతీ ఎయిర్‌టెల్ షేరు 6.37 శాతం పడిపోయింది. అమ్మకాల సెగతో ఎసిసి, అంబుజా సిమెంట్, జయప్రకాశ్ అసోసియేట్స్‌లాంటి సిమెంట్ స్టాక్స్ కూడా నష్టపోయాయి. అయితే టాటా మోటార్స్, మహింద్ర, మహింద్ర, బజాజ్ ఆటో, మారుతి సుజుకి లాంటి ప్రధాన ఆటో షేర్లు, గెయిల్, కోల్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్, లుపిన్, హెచ్‌డిఎఫ్‌సి షేర్లు లాభపడ్డాయి. సెనె్సక్స్‌లోని 30 కంపెనీల్లో 13 కంపెనీల షేర్లు నష్టపోగా, 16 షేర్లు లాభపడ్డాయి. పవర్‌గ్రిడ్ షేరు యథాతథంగా కొనసాగింది. ఆసియా మార్కెట్లలో మిశ్రమ ధోరణి కనిపించగా, ప్రధాన ఐరోపా దేశాల సూచీలు ప్రారంభంలోనే లాభాల్లో సాగాయి.