బిజినెస్

తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 10: తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత కేసీఆర్ సర్కార్ ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక ప్రాజెక్టు ఆమోద, స్వీయ ధ్రువపత్ర విధాన చట్టం 2014 (టీఎస్‌ఐపాస్)కు విశేష స్పందన లభించింది. దేశ, విదేశాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు తెలంగాణకు వెల్లువెత్తాయి. టీఎస్‌ఐపాస్ పారిశ్రామిక అనుకూల విధానాలను కలిగి ఉండడమే కారణమని సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్ 2019 ప్రకటించింది. 2014 నుంచి 2019 మార్చి 31వ తేదీ వరకు బహుళ సంఖ్యలో పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. మొత్తం 9604 పరిశ్రమల ఏర్పాటుకు , రూ.1,60,079.06 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దాదాపు 11.37 లక్షల మందికి ఉద్యోగాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంతవరకు 6935 పరిశ్రమలను ఏర్పాటు చేశారు. ఈ పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభించాయి. ఈ పరిశ్రమల స్థాపనకు రూ.76,398.78 కోట్ల పెట్టుబడులు పెట్టారు. 5.22లక్షల మందికి ఉద్యోగాలు లభించాయి. రూ.22,508.35 కోట్లతో ఏర్పాటు చేసిన 634 పరిశ్రమలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వీటి వల్ల 2,17,137 మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు. రూ.53,490.96 కోట్లతో 551 ఏర్పాటు చేయనున్న 551 పరిశ్రమలు ప్రాథమిక దశలో ఉన్నాయి. వీటి వల్ల 3,17,795 మందికి ఉద్యోగాలను కల్పించనున్నారు. కాగా రూ.7680.97 కోట్లతో 1484 పరిశ్రమలను ఏర్పాటు చేసే పనులు ప్రారంభించాల్సి ఉంది. వీటి నిర్మాణం పూర్తయితే 79,447 మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు. పరిశ్రమల్లో వివిధ రంగాలను విశే్లషిస్తే ఇంజనీరింగ్ రంగంలో రూ.2,764 కోట్లు, ఆహార రంగంలో రూ.4,086.50 కోట్ల, ఆగ్రో ఆధారిత పరిశ్రమలు, గిడ్డంగుల ఏర్పాటుకు రూ. 1,614.45 కోట్లు, గ్రానైట్, స్టోన్ క్రషింగ్ పరిశ్రమల రంగంలో రూ. 3,554.71 కోట్లు, సిమెంట్ పరిశ్రమల విభాగంలో రూ. 2,059.51 కోట్లు, ప్లాస్టిక్, రబ్బర్ పరిశ్రమల రంగంలో రూ.2,595.58 కోట్లు, ఫార్మాలో రూ. 8,745 కోట్లు, కాగితం, ప్రింటింగ్ పరిశ్రమల్లో రూ.2098.71 కోట్లు, జౌళి రంగంలో రూ. 1,425.98 కోట్లు, మద్యం పరిశ్రమలు రూ. 1,893 కోట్లు, విద్యుత్ ఉత్పత్తులు రూ. 1,772 కోట్లు, సౌర విద్యుత్ రంగంలో రూ. 17,072 కోట్లు, ఆర్ అండ్ డీలో రూ.3,598 కోట్లు, రియల్ ఎస్టేట్‌లో రూ.32,957 కోట్లు, కలప, తోళ్ల పరిశ్రమలో రూ. 80.80 కోట్లు, ఎరువుల రంగంలో రూ.3380 కోట్లు, ఆటోమొబైల్ రంగంలో రూ.1,354 కోట్లు, థర్మల్ విద్యుత్ ప్లాంట్‌లో రూ.61,368 కోట్లు, ఏరోస్పేస్‌లో రూ.2838 కోట్లు, ఐటీ సర్వీసుల్లో రూ. 2479 కోట్లు, రక్షణ రంగంలో రూ. 268.22 కోట్ల విలువ చేసే పెట్టుబడులు వచ్చినట్లు సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్‌లో పేర్కొన్నారు. రాష్ట్రప్రభుత్వం 3450 పరిశ్రమలకు టీ ఐడియా కింద ప్రోత్సాహకాలు ప్రకటించింది. మొత్తం రూ. 379.928 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఇనె్వస్ట్‌మెంట్ సబ్సిడీ కింద 264 కేసుల్లో రూ.49.91 కోట్లు, అమ్మకం పన్ను కింద 537 కేసుల్లో రూ.168.198 కోట్లు, స్టాంప్ డ్యూటీ కింద 537 కేసుల్లో రూ.4.13 కోట్లు, భూమి విలువ కింద 70 కేసుల్లో రూ.4.13 కోట్లు, నైపుణ్యం, విద్యుత్ రీఎంబర్స్‌మెంట్ కింద 1373 కేసుల్లో రూ.81.18 కోట్లు, పావలా వడ్డీ కింద 1206 కేసుల్లో 76.51 కోట్లను ప్రభుత్వం ప్రోత్సాహకాలుగా విడుదల చేసింది.