బిజినెస్

ఎయిర్‌టెల్, ఐడియా షేర్లు కుదేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: రిలయన్స్ జియో దెబ్బకు గురువారం ప్రధాన టెలికాం సంస్థల షేర్లు కుదేలయ్యాయి. జియో వినియోగదారులకు జీవితకాలం ఉచిత వాయిస్ కాల్స్, 50 రూపాయలకే 1జిబి డేటా లాంటి ఆఫర్లను రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించడం టెలికాం కంపెనీలపై ప్రభావం చూపించింది. దీంతో ఆ సంస్థల షేర్లు భారీగా పతనమైనాయి. గురువారం బిఎస్‌ఇలో ఐడియా సెల్యులార్ షేరు ధర 10.48 శాతం పడిపోయింది. ఒక దశలో ఆ షేరు 11 శాతానికి పైగానే పడిపోయింది. అలాగే దేశంలోనే అతిపెద్ద టెలికాం సంస్థల్లో ఒకటైన భారతీ ఎయిర్‌టెల్ షేరు కూడా భారీగానే పతనమైంది. ఒక దశలో దాదాపు 9 శాతం దాకా పతనమైన ఆ షేరు చివరికి 6.37 శాతం నష్టంతో ముగిసింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్, టాటా టెలీ సర్వీసెస్ లిమిటెడ్ షేర్లు కూడా పతనమైనాయి. ఫలితంగా భారతీ ఎయిర్‌టెల్ మార్కెట్ విలువ రూ. 11,932 కోట్ల మేర పడిపోగా, ఐడియా సెల్యులార్ మార్కెట్ విలువ రూ. 3,709 కోట్లు, ఆర్-కామ్ విలువ రూ. 1,356 కోట్లు పడిపోయింది. మొత్తంమీద రిలయన్స్ జియో దెబ్బకు టెలికాం కంపెనీలు రూ. 16,997 కోట్ల మేర మార్కెట్ విలువను కోల్పోయాయి. కాంపిటేషన్ కమిషన్ 11 సిమెంట్ కంపెనీలపై భారీగా జరిమానాలు విధించిన నేపథ్యంలో సిమెంట్ కంపెనీల షేర్లు సైతం భారీగా పతనమైనాయి.