బిజినెస్

లక్ష్య సాధనలో సింగరేణి తడబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, సెప్టెంబర్ 1: ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న బొగ్గు ఉత్పత్తి లక్ష్యసాధనలో సింగరేణి సంస్థ తడబడుతోంది. వేసవికాలంలో ఎండలు, ప్రస్తుత కాలంలో వర్షాలు ఉత్పత్తికి ఆటంకంగా మారాయి. ఆగస్టు మాసం పూర్తయ్యేసరికి గడచిన ఐదు మాసాల్లో 2 కోట్ల 47 లక్షల 79 వేల 600 టన్నులు సాధించాల్సి ఉండగా 2 కోట్ల 21లక్షల 57 వేల 930 టన్నులు మాత్రమే సాధించి 89 శాతం ఉత్పాదకరేటును నమోదు చేసుకుంది. ప్రస్తుత పరిస్థితులలో లక్ష్యసాధనకు సంస్థ ప్రతిరోజు రెండు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించాల్సిన పరిస్థితిలో ఉంది. బొగ్గు ఉత్పత్తిలో కొత్తగూడెం ఏరియా 104 శాతం ఉత్పాదకరేటుతో ప్రథమస్థానంలో ఉండగా, శ్రీరాంపూర్ ఏరియా 100 శాతంతో ద్వితీయ స్థానంలో నిలిచింది. మిగిలిన తొమ్మిది ఏరియాలు లక్ష్య సాధనలో వెనుకబడి ఉన్నాయి. ఇల్లందు ఏరియా 82శాతం, మణుగూరు 88శాతం, రామగుండం-1 ఏరియా 90శాతం, రామగుండం-2 ఏరియా 87 శాతం, రామగుండం-3 ఏరియా 99శాతం, భూపాలపల్లి ఏరియా 93శాతం, ఆడ్రియాలా ప్రాజెక్ట్ 63 శాతం, బెల్లింపల్లి ఏరియా 93 శాతం, మందమర్రి ఏరియా 60 శాతం ఉత్పాదక రేట్లను నమోదు చేసుకున్నాయి.