బిజినెస్

తెలంగాణలో పెట్టుబడులకు జాన్సన్ అండ్ జాన్సన్ ఆసక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 1:తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడికి అనుకూల వాతావరణం ఉందని, ప్రభుత్వ సహకారం బాగుందని జాన్సన్ అండ్ జాన్సన్ గ్రూప్ అభినందించింది. జాన్సన్ అండ్ జాన్సన్ సీనియర్ ఉపాధ్యక్షురాలు క్యాతీ వెంగల్‌త కెటిఆర్ గురువారం సమావేశం అయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని జాన్సన్ అండ్ జాన్సన్ ప్రాంగణంలో మంత్రి, క్యాతీ వెంగల్ మొక్కలు నాటారు. జాన్సన్ అండ్ జాన్స్‌ను ప్రాంగణాన్ని సందర్శించారు. అనంతరం హైదరాబాద్‌తో మంత్రితో జాన్సన్ అండ్ జాన్సన్ బృందం భేటీ అయింది. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఈ బృందానికి కెటిఆర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. హెల్త్‌కేర్, బయోటెక్నాలజీ, లైఫ్ సైనె్సస్, ఫార్మా రంగాల్లో జాన్సన్ కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు ఉన్నాయని కెటిఆర్ తెలిపారు. తెలంగాణ ఇప్పటికీ దేశంలో ఫార్మా, హెల్త్‌కేర్ క్యాపిటల్‌గా ఉందని చెప్పారు. నగరంలో మెడికల్ టూరిజం హబ్‌గా మారిందని అన్నారు. ఈ నేపథ్యంలో జాన్సన్ అండ్ జాన్సన్ హెల్త్ కేర్ రంగంలో విస్తరించేందుకు ప్రయత్నించాలని కోరారు. దేశంలో హెల్త్ కేర్ రంగం 120 బిలియన్ డాలర్లు అని, కేంద్రం ఇప్పటికే మేక్ ఇన్ ఇండియా ద్వారా తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తోందని మంత్రి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం సైతం రాష్ట్రంలో తయారీ రంగంలో వచ్చే పెట్టుబడులకు ప్రాధాన్యత ఇస్తోందని, ఇందు కోసం ప్రత్యేకమైన ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నదని చెప్పారు. టిఎస్‌ఐపాస్ విధానం ద్వారా పారదర్శకంగా అనుమతులు ఇస్తున్నట్టు తెలిపారు. పరిశ్రమలకు నిరంతరం విద్యుత్ ఇస్తోందని, నీటికి, భూమికి ఎలాంటి కొరత లేదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి కెటిఆర్ మూడు ప్రతిపాదనలు చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. దీనితో పాటు జాన్సన్ అండ్ జాన్సన్ వారి జె ల్యాబ్స్ ఇక్కడ ఏర్పాటు చేయాలన్నారు. ఇక మెడ్ టెక్ పార్క్‌లో ప్రధాన పెట్టుబడి దారులుగా ఉండాలని కెటిఆర్ జాన్సన్ అండ్ జాన్సన్‌ను కోరారు. తెలంగాణ ప్రభుత్వం జాన్సన్ అండ్ జాన్సన్ భాగస్వామ్యం మరింత బలోపేతం కావడం కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని చెప్పారు. జాన్సన్ అండ్ జాన్సన్ కొత్తూరు ప్రాంగణ నిర్మాణంతో పాటు తమ సంస్థకు ప్రభుత్వం నుంచి అందిన సహకారాన్ని క్యాతీ వెంగల్ అభినందించారు. రెండేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులను తాము గుర్తించామని చెప్పారు. తెలంగాణ మెడికల్ డివైజెస్ పార్క్ పట్ల ఆమె ఆసక్తి చూపించారు. పార్మాసిటీలో ప్రభుత్వం తెలిపిన సౌకర్యాలు అందుబాటులోకి వస్తే పలు అంతర్జాతీయ కంపెనీలు భాగస్వామ్యానికి ముందుకు వస్తాయని చెప్పారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, టియస్‌ఐఐసి యండి వెంకట నర్సింహ్మారెడ్డి తదితరులు ఉన్నారు.

చిత్రం.. తెలంగాణలో పెట్టుబడులకు గల అవకాశాలను జాన్సన్ అండ్ జాన్సన్ బృందానికి వివరిస్తున్న కెటిఆర్