బిజినెస్

చైనాకు మెయిన్‌లైన్ సర్వీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఆగస్టు 29: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు నుంచి చైనాకు కంటైనర్ టెర్మినల్ మెయిన్‌లైన్ సర్వీసును మాస్కలైన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఫ్రాంక్ డెడెనిస్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డెడెనిస్ మాట్లాడుతూ కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్‌లో ప్రపంచ స్థాయి వౌలిక వసతులు కల్పించారని ప్రశంసించారు. దీంతో తమ సంస్థ చైనాకు వారపు సర్వీసులను ప్రారంభించేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. తమ సంస్థ ఇప్పటికే ఇక్కడ్నుంచి సలాలాకు విజయవంతంగా సర్వీసులను నడుపుతోందని గుర్తు చేశారు. కాగా, చైనాకు ప్రతి వారం సర్వీసులను కొరియాకు చెందిన హంజిన్ షిప్పింగ్ సంస్థ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కృష్ణపట్నం పోర్టు సిఇఒ, డైరెక్టర్ అనిల్ ఎండ్లూరి మాట్లాడుతూ కంటైనర్ మెయిన్ సర్వీస్ ద్వారా పత్తి, వరి, పొగాకు, మిర్చి, రొయ్యలు, గ్రానైట్, సిమెంటు వంటి ఎగుమతులతోపాటు న్యూస్ ప్రింట్, సోలార్ ప్యానల్స్, ఫర్నిచర్, యంత్ర పరికరాలు, ఆటో పనిముట్ల వంటి దిగుమతులకు మరింత వీలుగా కంటైనర్ వారపు సర్వీసులను మాస్కలైన్ సంస్థ కృష్ణపట్నం పోర్టు నుండి వారపు సర్వీసులను ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ టెర్మినల్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌తోపాటు, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ఎగుమతి, దిగుమతి దారులకు చైనా, తూర్పు, ఈశాన్య ఆసియా దేశాల పోర్టులకు అత్యంత వేగవంతమైన సర్వీసును అందించినట్లవుతుందని అన్నారు. చైనా నుంచి ఫర్నీచర్, కార్యాలయ అంతర్గత, హోటల్ అలంకరణ సామగ్రి బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు ఎక్కువగా దిగుమతవుతోందని, అయితే దీనికి సమయం 40-45 రోజులు పడుతోందని, ప్రస్తుత వారపు సర్వీసు ద్వారా ఈ సమయం గణనీయంగా తగ్గిపోనుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించాలని నిర్ణయించిందని, ఈ వారపు టెర్మినల్ సర్వీస్ ద్వారా షాంఘై పోర్టు నుంచి కృష్ణపట్నం పోర్టుకు కేవలం 15 రోజుల్లోగా ఈ పరికారాల దిగుమతి జరుగుతుందని స్పష్టం చేశారు. కాంకర్ సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్ ఆర్ ధనుంజయులు మాట్లాడుతూ హైదరాబాద్, బెంగళూరు నగరాల నుంచి కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్‌కి కాంకర్ సంస్థ నిరంతరాయంగా రైలు సర్వీసులను అందిస్తుందని వెల్లడించారు. తమ సంస్థ రాక్ సర్వీసును ప్రారంభించి బెంగళూరు నుంచి దిగుమతుల క్లియరెన్స్ వేగవంతంగా జరిగేందుకు వీలు కల్పించిందన్నారు. ఈ కార్యక్రమంలో కెపిసిటి సిఇఒ జితేంద్ర, డైరెక్టర్ వినీత వెంకట్, సిఒఒ సుబ్బారావు, జిఆర్ ప్రసాద్, కాంకర్ ప్రతినిధులు, పోర్టు అధికారులు పాల్గొన్నారు.

చిత్రం.. కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ సర్వీసును ప్రారంభిస్తున్న మాస్కలైన్ ఇండియా ఎండి ఫ్రాంక్ డెడెనిస్, లంగరేసిన భారీ నౌక