బిజినెస్

‘ద్రవ్యోల్బణం తగ్గితేనే వడ్డీరేట్ల తగ్గుదల సాధ్యం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 29: ద్రవ్యోల్బణం తగ్గితేనే వడ్డీరేట్ల తగ్గుదలకు అవకాశం ఉంటుందని, అప్పుడే అది సాధ్యపడుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ సోమవారం స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణం గణాంకాలు ఇప్పటికీ ఆర్‌బిఐ లక్ష్యానికి ఎగువనే ఉన్నాయన్నారు. గత నెల జూలైలో చిల్లర ద్రవ్యోల్బణం దాదాపు రెండేళ్ల గరిష్ఠాన్ని తాకుతూ 6.07 శాతంగా ఉంటే, టోకు ద్రవ్యోల్బణం కూడా 23 నెలల గరిష్ఠాన్ని చేరి 3.55 శాతంగా ఉంది. ఈ క్రమంలోనే గత ఆర్థిక సంవత్సరానికి (2015-16)గాను ఆర్‌బిఐ నివేదికలో రాజన్ పైవిధంగా స్పందించారు. ఇదిలావుంటే ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) దేశ జిడిపి వృద్ధిరేటు 7.6 శాతంగా నమోదు కావచ్చని రాజన్ అంచనా వేశారు. కాగా, 2015-16లో ఆర్‌బిఐ బ్యాలెన్స్ షీట్ 12.3 శాతం పెరిగి 32.43 లక్షల కోట్ల రూపాయలుగా నమోదైంది.