బిజినెస్

హైదరాబాద్ రియాల్టీ మార్కెట్ జోష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 23: హైదరాబాద్ రియాల్టీ మార్కెట్ మూడుపువ్వులు, ఆరుకాయలుగా వర్థిల్లుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ మధ్య మార్కెట్ లావాదేవీలు పెరిగాయి. ఈ వివరాలను ప్రోపర్టీ పోర్టల్ 99కామ్ పేర్కొంది. రెసిడెన్షియల్ అపార్టుమెంట్ సగటు ధరలు స్వల్పంగా ఒక శాతం పెరిగాయి. గచ్ఛిబౌలి, కొండాపూర్, మాదాపూర్ వంటి ఐటీ సంబంధిత కేంద్రాల సమీపంలో ఉన్న శివారు ప్రాంతాల్లో కొనుగోలుదారులు, పెట్టుబడీదారుల పెట్టుబడులు పెరిగాయి. దేశంలో ఇతర ప్రాంతాలతో పోల్చితే హైదరాబాద్ రియాల్టీ రంగంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో సగటు అద్దెలు గత సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోల్చితే నాలుగు శాతం పెరిగాయి. ఈ ఏడాది హైదరాబాద్‌లో 3026 యూనిట్లతో నూతన అపార్టుమెంట్ ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో ఆమోదించిన 936 ప్రాజెక్టుల్లో 121 ప్రాజెక్టులు ఒక్క హైదరాబాద్‌లోనే ఉన్నాయి. అపార్టుమెంట్లలో ప్రతి చదరపు అడుగు ధరలు మణికొండలో 8 శాతం, నిజాంపేటలో 4 శాతం, మియాపూర్‌లో 8 శాతం, గచ్ఛిబౌలీలో 9 శాతం, కొండాపూర్‌లో 7 శాతం, కూకట్‌పల్లిలో 8 శాతం, ప్రగతినగర్‌లో 5 శాతం, బీరంగూడలో 3 శాతం, నల్లగండ్లలో ఆరుశాతం పెరిగాయి. గచ్ఛివౌలీ, హైటెక్ సిటీలలో పనిచేస్తున్న టెక్ నిపుణుల నుండి డిమాండ్ కారణంగా, నల్లగండ్లలో సగటు కేపిటల్ ధరలు గత ఏడాదితో పోల్చితే నాలుగు శాతం పెరిగాయి. గండిపేటలో స్థిరాస్థి రిజిస్ట్రేషన్లద్వారా ఆదాయం గత ఏడాది ఇదే సమయంలో పోల్చితే దాదాపు వందశాతం వరకు పెరుగుదల ఉంది. వాణిజ్య రంగంలో పెట్టుబడుల ప్రవాహం కూడా రెంటల్ మార్కెట్‌ను పెంచిందన్నారు. శంకర్‌పల్లి నుంచి ముత్తంగి రోడ్, శంకర్‌పల్లి కోకాపేట్ రోడ్ నుంచి కోకాపేట్ నుండి ముత్తంగి నుంచి ఔటర్ రింగ్ రోడ్ గృహాలు కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి కీలక గమ్యస్థానాలుగా మారాయి.