బిజినెస్

‘ఇర్కోడు’తో దేశ, విదేశాలకు మాంసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట అర్బన్, ఆగస్టు 11: దేశవిదేశాలకు మాంసకృత్తుల ఉత్పత్తులను ఎగుమతి చేసేలా ఆర్డర్లు తెచ్చుకునేలా ఇర్కోడ్‌లో మాంసం పరిశ్రమ నెలకొల్పోతున్నామని మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. దేశంలోని 28 రాష్ట్రాల ప్రజలు సగం మాంసం తింటే .. మిగత సగం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో తింటున్నారని ఆయన వెల్లడించారు. ఆదివారం సిద్దిపేట రూరల్ మండలం ఇర్కోడ్ గ్రామంలోని లావణ్య గార్డెన్స్‌లో మహిళలకు అవగాహన, సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘కొత్తది చేద్దాం... మార్కెట్లో డిమాండ్ ఉన్నది చేద్దాం.. ఎవరూ చేయనిది చేద్దామన్నదే తన ఆలోచన అని అన్నారు. క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్స్, వడ్ల బీట్‌లో నిర్వహణలో ఫస్ట్ నిలిచిన ఇర్కోడ్ గ్రామాన్ని మరింత ఆదర్శంగా మార్చేలా గ్రామంలో మటన్‌ప్రాసెసింగ్ యూనిట్‌తో మరో ముందడుగు వేస్తున్నామని వెల్లడించారు. ఇర్కోడ్ మాంసం తొక్కు అంటే.. లొట్టలేసుకొని తినేలా బ్రాండ్‌గా మారుద్దాం’ అన్నారు. మొదటసారిగా మహిళలు శిక్షణ పొంది స్వయం సమృద్ధి సాధించాలని హరీశ్ పిలుపునిచ్చారు. అభివృద్ధి చెందడమంటే రోడ్లు, భవనాలు నిర్మిస్తేకాదని మీరు వ్యక్తిగతంగా ఎదిగితే నిజమైన అభివృద్ధి అన్నారు. బెంగళూరు వారు వచ్చి హైదరాబాద్ సూపర్ మార్కెట్లో మటన్ వ్యాపారం చేస్తుండగా లేనిది ఇర్కోడ్ మటన్ అమ్మకాలు మనం చేయలేమా? అని ప్రశ్నించారు. దేశంలో మొత్తంలో మాంసపుకృత్తులకు సంబంధించిన శిక్షణ కేంద్రం హైదరాబాద్‌లో ఉందని తెలిపారు. 20 రోజులపాటు మీకు శిక్షణ ఇప్పించనున్నట్టుతెలిపారు. మాంసకృత్తులను రకరకాలైన వంటకాలుగా మార్చుకునేలా తయారు చేయవచ్చునని వెల్లడించారు. సంఘం బలపడితే.. మహిళలు అర్థికంగా ఎదుగుతారని, సిద్దిపేట మున్సిపాలిటీలో ఏర్పాటు చేసే స్లాటర్ హౌస్‌ను 2 కోట్లతో ఇర్కోడ్‌లో ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇక మనకు హైదరాబాద్‌లో కావాల్సిన మార్కెట్ ఇర్కోడ్‌లో ఉంటుందన్నారు. ఇర్కోడ్ గ్రామాన్ని దత్తత తీసుకున్న చందర్‌రావు సహకారంతో ఇర్కోడ్ మటన్ హైదరాబాద్ ప్యారడైజ్ బిర్యానీ అవుతుందన్నారు. మొదటి అడుగు హైదరాబాద్ వేద్దామని, రెండవ అడుగు ఇర్కోడ్ మటన్ మస్కట్, దుబాయ్ పోవాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతులు జరుగుతాయనే నమ్మకం తనకు ఉందన్నారు. ఆ దిశగా శిక్షణలో అన్ని విషయాలు శోధించి సాధించాలని కోరారు. ఈ నెల 17న నుండి 20 మంది మహిళలు శిక్షణ పొందవలసి ఉంటుందన్నారు. ఇర్కోడ్ మహిళల్నందరినీ లక్షాధికారులగా చూడాలన్నది తన కోరికన్నారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా చేస్తున్న కార్యక్రమమిదని మొదట్లో కొంత కష్టంగా ఉన్న భవిష్యత్తులో లాభాలను గడిస్తామని చెప్పారు. జడ్పీ చెర్‌పర్సన్ వేలేటి రోజాశర్మ మాట్లాడుతూ మహిళలు అర్థికంగా అభివృద్ధితో పాటు వ్యక్తిగత అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు. ఎమ్మెల్సీ ఫార్‌ఖ్‌హుస్సేన్ మాట్లాడుతూ అంకాపూర్ చికెన్ అంటే పేరు గడించిందన్నారు. హరీష్ ఆలోచనతో మటన్ అంటే ఇర్కోడ్ ప్రపంచానికి తెలుస్తుందన్నారు. సమావేశంలో సెర్ఫ్ డైరెక్టర్ అనంతం, కేంద్ర మాంస పరిశోధన సీనియర్ శాస్తవ్రేత్త బస్వారెడ్డి, మన్సిపల్ చైర్మెన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి,డిపీఓ సురేశ్‌బాబు, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ తదితరులు మాట్లాడారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.