బిజినెస్

‘సెబీ’ కేసు పరిష్కరించుకున్న యాక్సిస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 9: డిబెంచర్ ట్రస్టీ మార్గదర్శకాలను పాటించకపోవడం వల్ల సెబీ నమోదు చేసిన కేసును యాక్సిస్ బ్యాంక్ శుక్రవారం పరిష్కరించుకుంది. ఇందుకు సంబంధించి రూ. 2.43 కోట్ల రూపాయలు యాక్సిస్ బ్యాంక్ యాజమాన్యం సెటిల్మెంట్ చార్జీల కింద చెల్లించింది. ఆ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్న మేరకు యాక్సిస్ బ్యాంకు సెబీ రిజిస్ట్రేషన్ కలిగిన డిబెంచర్ ట్రస్టీ. ఐతే ఇందుకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించారని కనుగొన్న సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) 2018 జూన్‌లో ఆ బ్యాంకు నిర్వాహకులకు షోకాస్ నోటీసులు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఇస్యూయర్ కంపెనీలకు ఈ బ్యాంకు రుణాలు ఇచ్చిందని, అలాగే డిబెంచర్ ట్రస్టీ సేవలను ఆ కంపెనీలకు వర్తింపజేసిందని సెబీ ఆరోపించింది. సంబంధిత ఇస్యూయర్ కంపెనీల తాలూకు త్రైమాసిక ఫలితాలను రాబట్టడంలోనూ బ్యాంకు విఫలమైందని సెబీ అభియోగం మోపింది. అలాగే ఆ కంపెనీల లిస్టింగ్ ఒప్పందాన్ని సైతం నిబంధనల మేరకు చేయలేదని సెబీ ఆ షోకాజ్ నోటీసులో పేర్కొంది. అంతేకాకుండా గత తనిఖీల అనంతరం సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు బ్యాంక్ యాజమాన్యం తప్పుడు నివేదిక ఇచ్చిందని సెబీ పేర్కొంది. ఇలావుండగా కేసు విచారణ సాగుతున్న క్రమంలో సెటిల్మెంట్ కోసం గత మే మాసంలో బ్యాంక్ యాజమాన్యం దరఖాస్తు చేసింది. ఆరోపణలకు సంబంధించిన నిబంధనల మేరకు తగిన పరిహారం చెల్లిస్తామని తెలిపింది. ఈక్రమంలో సెబీ కమిటీ నిర్ణయం మేరకు రూ. 2.43 కోట్ల రూపాయలు యాక్సిస్ బ్యాంక్ చెల్లించింది.