బిజినెస్

పెట్టుబడులు, సంక్షేమానికి ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 9: పెట్టుబడులను స్వాగతించడంతో పాటు సంక్షేమ కార్యక్రమాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. విజయవాడలో శుక్రవారం జరిగిన అవుట్‌రీచ్ సదస్సులో సీఎస్ మాట్లాడుతూ ఇది పెట్టుబడులను ప్రోత్సహించే మొట్టమొదటి అత్యున్నత సమావేశమన్నారు. సహజ వనరులు, ఖనిజ సంపద, మానవ వనరులు పుష్కలంగా రాష్ట్రంలో ఉన్నాయని, డైనమిక్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర యంత్రాంగం పరిశ్రమల స్థాపనకు, రాష్ట్ర ప్రజల అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తున్నదన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల ద్వారా సంక్షేమ పథకాలను కూడా అమ లు చేస్తున్నదన్నారు. పశుసంవర్థక, పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య మాట్లాడుతూ చేపలు, రొయ్యలు, పాడి పరిశ్రమల స్థాపనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనుకూలంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేపలు, రొయ్యల ఉత్పత్తిలో దేశంలోనే మొదటిస్థానంలో ఉం దని, జీఎస్‌డీపీలో 7.40%తో ఫీషరీస్ సెక్టార్ భాగస్వా మ్యం కలిగి ఉందన్నారు. ఆక్వా కల్చర్ సాగు, ఉత్పత్తి రంగాల్లో రాష్ట్రం ప్రతి ఏడాది వృద్ధి సాధిస్తూ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని వివరించారు. ముఖ్యమంత్రి సలహాదారు ఎం.శామ్యూల్ మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి చేరువ చేసేందుకు అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నవరత్నాలను ప్రవేశపెట్టిందన్నారు. వీటి ద్వారా ప్రతి ఒక్కరూ ఆర్థిక పరిపుష్టి సాధించి రాష్ట్ర పురోభివృద్ధికి దోహదపడతారన్నారు. పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ధి ముఖ్య కార్యదర్శి కె ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగం దినదినాభివృద్ధి చెందుతూ పెట్టుబడులను ఆకర్షిస్తోందన్నారు. పరిశ్రమలు, వౌలిక వసతుల అభివృద్ధి, పెట్టుబడుల సంస్థ ప్రిన్సిపల్ సెక్రటరీ రజిత్ భార్గవ మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు అనువైన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని, పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కియా మోటార్స్, ఇసుజూ మోటార్స్‌తో పాటు హెచ్‌సియల్, సెల్‌కాన్, సిప్లా, అపోలో వంటి అంతర్జాతీయ పరిశ్రమలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ఆరు విమానాశ్రయాలు, ఆరు ఓడరేవులు ఉన్నాయని అంటూ రవాణాకు అన్ని విధాలా అనుకూలంగా ఉందన్నారు. విశాఖపట్నం, చెన్నై ఇండస్ట్రీయల్ కారిడార్ నోడ్‌లో పరిశ్రమల ఏర్పాటుకై భూమిని సేకరించామన్నారు. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కెఎస్ జవహర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. వైద్య రంగంలో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనుకూలంగా ఉందని ప్రిన్సిపల్ సెక్రటరీ అన్నారు. ఈ సదస్సులో కేంద్ర విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శి హరీష్, సుమారు 35 దేశాలకు చెందిన 50 మంది రాయబారులు, కాన్సులేట్ జనరళ్లు, హైకమిషనర్లు, పలువురు రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.