బిజినెస్

అధికారిక జాబితాలోని సెక్యూరిటీల్లోనే ఇక మ్యూచువల్ పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 8: హైరిస్క్ మ్యూచువల్ ఫండ్లలో మదుపుచేసిన వారి ప్రయోజనాలు రక్షించే నిమిత్తం సెబీ సరికొత్త చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఫండ్ హౌస్‌లు తమ పెట్టుబడులన్నింటినీ లిస్టెడ్ (అధికారిక జాబితాలో ఉన్న) లేదా త్వరలో లిస్టెడ్ కానున్న ఈక్విటీలు, రుణ సెకూరిటీల్లోకి మార్చు కోవాల్సిందిగా ఆదేశించింది. దశల వారీగా ఈ పెట్టుబడుల మార్పు చేసుకోవచ్చని సూచింది. ప్రధానంగా రేటింగ్ లేని రుణ వ్యవస్థలో పెట్టుబడులను ప్రస్తుతం ఉన్న 25 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని సెబీ నిర్ణయించింది. వౌలిక మార్కెట్లలో మదుపు చేసేవారికి రిస్క్‌తో కూడుకున్న రుణ సెక్యూరిటీలు ప్రధాన సమస్యగా మారడాన్ని సెబీ గుర్తించింది. మ్యూచువల్ ఫండ్ల నుంచి పెట్టుబడులు మళ్లించేవారు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈక్రమంలో సంక్లిష్టత సమసిపోయేలా చేసి భద్రతను పెంచేందుకు సెబీ చర్యలు తీసుకుంటోంది. గత జూన్‌లో ఇందుకు సంబంధించిన సెబీ బోర్డు ఆమోదం పొందిన అంశాల అమలుకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా ఇప్పటికే రుణ, ధన మార్కెట్లలో మ్యూచువల్ ఫండ్ పథకాల మార్గదర్శకాలను సవరించేందుకు అనుగుణంగా ఓ డ్రాఫ్ట్‌ను సైతం రూపొందించడం జరిగింది. మరిన్ని సవరణలను సైతం జతచేసి ఈనెలలోనే జరుగనున్న తదుపరి సెబీ బోర్డు సమావేశం ఆమోదం కోసం సిద్ధం చేస్తోంది. అలాగే రేటింగ్ లేని రుణ సంస్థల్లో పెట్టుబడులకు ప్రస్తుతం ఉన్న 10 శాతం ఏకకాల విడుదల పరిమితిని పూర్తిగా తొలగించాలన్న ప్రతిపాదన సైతం సెబీ పరిశీలనలో ఉందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. అలాగే ఇప్పటికే బోర్డు ప్రాథమిక ఆమోదం పొందిన రుణ, ధన మార్కెట్ల విలువ అంచనాలకు సంబంధించిన నిబంధనలను సవరించి ‘మార్ టు మార్కెట్’ విధానాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాల్సి ఉంది.