బిజినెస్

మళ్లీ తగ్గిన రెపో రేట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 7: స్వల్ప ఆర్థిక మాంద్య పరిస్థితులు కనిపిస్తున్నప్పటికీ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేట్లను మరోసారి తగ్గించింది. బేసిక్ పాయింట్స్ (బీపీఎస్) ఏకంగా 35 పాయింట్లు తగ్గడంతో రెపో రేటు 5.4 శాతానికి చేరింది. ఆర్‌బీఐ రెపో రేట్లను తగ్గించడం ఈ ఆర్థిక సంవత్సరం ఇది నాలుగోసారి. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. ఇది అతి తక్కువ లేదా ఎక్కువ కాకుండా సమతుల్యమైన విధానమని ఆయన ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రెపో రేట్లను తగ్గించకుండా బ్యాంకుల పనితీరు మెరుగుపడే అవకాశం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు ఆర్‌బీఐ 110 పాయింట్ల బీపీఎస్‌ను తగ్గించడం గమనార్హం. ఈ విషయాన్ని శక్తికాంత దాస్ ప్రస్తావిస్తూ ఆర్థిక
మాంద్య పరిస్థితులు తలెత్తినపుడు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. అయితే, వృద్ధి రేటుకు ఇది ఏమాత్రం ఆటంకం కాదని ఆయన తేల్చిచెప్పారు. ప్రభుత్వం కూడా ఇందుకు సానుకూలంగా స్పందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రెపో రేట్లను తగ్గించడం ద్వారా బ్యాంకులు బలోపేతం అవుతాయని ఆయన అన్నారు. ఇలావుంటే, ఎల్‌అండ్‌టీ చైర్మన్ ఏఎం నాయక్, గోద్రెజ్ గ్రూప్ చైర్మన్ ఆది గోద్రెస్ తదితరులు రిజర్వు బ్యాంకు నిర్ణయాన్ని తప్పుపట్టారు. రెపో రేట్లను ఇష్టానుసారంగా తగ్గించడం వల్ల దేశం ఆర్థిక మాంద్యం దిశగా వెళ్లే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు. అయితే, శక్తికాంత దాస్ మాత్రం స్థూల జాతీయ ఉత్పత్తుల్లోగానీ, ముందుగా నిర్ణయించుకున్న వృద్ధి రేటును సాధించడంలోగానీ ఎలాంటి ఒడిదుడుకులు ఉండబోవని అన్నారు.