బిజినెస్

స్టాక్ మార్కెట్లపై కాశ్మీర్ టెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 5: జమ్మూ కాశ్మీర్ ఉద్రిక్తతలు దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. దరిమిలా సోమవారం రెండు సూచీలు భారీగా నష్టపోయాయి. 418.38 పాయింట్లు కోల్పోయిన సెనె్సక్స్ సెనె్సక్స్ 36,700 పాయింట్ల కంటే దిగువకు చేరుకుంది. ఈ సూచీకి ఇది ఐదు నెలల కనిష్ట స్ధాయి. అలాగే ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ సైతం 134.75 పాయింట్లు కోల్పోయి 10,862.60 పాయింట్ల దిగువకు చేరింది. కాగా ఒక్కసారిగా వివిధ రకాల ప్రతికూలతలు ఎదురై రోజంతా రెండు సూచీలూ తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. ప్రధానంగా కాశ్మీర్‌లో రాజకీయ అనిశ్చితి, ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లలో నెలకొన్న అమ్మకాల వత్తిడి మన దేశీయ స్టాక్ మార్కెట్ల సెంటిమెంటుపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఒక దశలో దాదాపు 700 పాయింట్లు నష్టపోయిన 30 షేర్ల సూచీ సెనె్సక్స్ తర్వాత స్వల్పంగా కోలుకుంది. చివరికి 1,13 శాతం నష్టాలతో 36,699.84 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఒక దశలో ఈ సూచీ 36,416.79 పాయింట్ల కనిష్టాన్ని, మరో దశలో 36,844.05 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. అలాగే 50 షేర్ల నిఫ్టీ సైతం 1.23 శాతం నష్టాలతో 10,862.60 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఈ సూచీ పరిధిలోని 38 స్టాక్స్ నష్టాలు చవిచూశాయి. సెనె్సక్స్ ప్యాక్‌లో అత్యధికంగా ఎస్ బ్యాంక్ 8.15 శాతం నష్టపోయింది. అలాగే టాటామోటార్స్ 5.25 శాతం, పవర్‌గ్రిడ్ 4.42 శాతం, ఆర్‌ఐఎల్ 3.48 శాతం, కోటక్ బ్యాంక్ 3.13 శాతం వంతున నష్టపోయాయి. మరోవైపు భారతీ ఎయిర్‌టెల్, టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఆటో అధికంగా లాభపడిన సంస్థల జాబితాలో అగ్రభాగాన నిలిచాయి. ఇక రంగాల వారీగా తీసుకుంటే ఐటీ మినహా మిగిలిన రంగాల సూచీలన్నీ నష్టాల్లోనే (2.7 శాతం) ముగిశాయి. ఇందులోప్రధానంగా లోహ, బ్యాంకింగ్, వాహన, ఎఫ్‌ఎంసీజీ, ఇన్ఫ్రా, పార్మా అత్యధిక నష్టాలను చవిచూశాయి. ఇక బీఎస్‌ఈలో స్మాల్‌క్యాప్ సూచీ ఒక శాతం నష్టపోయింది. అంతర్జాతీయంగా మార్కెట్లలో చోటుచేసుకున్న అమ్మకాల వత్తిడికి కొనసాగింపులా మన దేశీయ స్టాక్ మార్కెట్లలో సైతం తొలుత భారీగా వాటాల విక్రయాలు జరిగాయి. రూపాయి మారకం విలువ తగ్గడం సైతం ఈ ప్రతికూలతలకు తోడైంది. ఆ తర్వాత వాహన, లోహ, బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ, వౌలిక, పార్మా రంగాలు కొంతమేర కోలుకోవడంతో స్టాక్ మార్కెట్లకు అతి తీవ్ర స్ధాయి నష్టాలు తప్పాయి. ఇందులో రూపాయి బలహీన పడడం ద్వారా ఐటీ రంగం లబ్ధిపొందిందని విశే్లషకులు భావిస్తున్నారు. కాగా రాజ్యసభలో తీవ్ర వ్యతిరేకత ఎదురైనప్పటికీ జమ్మూ కాశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు (జమూ అండ్ కాశ్మీర్, లడక్)గా విడగొడుతూ కేంద్ర ప్రభుత్వం చేసిన తీర్మాన నేపథ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు మార్కెట్లను నష్టాలపాలు చేశాయి. అలాగే అంతర్జాతీయ మార్కెట్లలో ఒడిదుడుకుల నేపథ్యంలో అమెరికన్ డాలర్‌తో రూపాయి మారకం విలువ సోమవారం 90 పైసలు తగ్గిపోయి ఇంట్రాడేలో రూ. 70.50గా ట్రేడైంది. అలాగే చైనా యువాన్ విలువ సైతం 7.03 స్థాయికి పడిపోయింది. ఎగుమతులను ప్రోత్సహించేందుకుగాను చైనా ప్రభుత్వం కరెన్సీ విలువను స్వచ్ఛందంగా తగ్గించిందన్న వార్తలు వెలువడ్డాయి. ప్రధానంగా 300 బిలియన్ డాలర్ల విలువైన చైనా ఉత్పత్తుల దిగుమతులపై 10 శాతం కొత్త సుంకాలను విధించనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై వచ్చిన ప్రతికూలతలను సరిచేసేందుకు చైనా ఈ చర్యలు చేపట్టిందని అంటున్నారు. కాగా ఆసియా మార్కెట్లలో షాంఘై కాంపోజిట్ సూచీ, హ్యాంగ్‌సెంగ్, నిక్కీ, కోస్పి సోమవారం నష్టాలను చవిచూశాయి. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.74 శాతం తగ్గి బ్యారెల్ 61.43 డాలర్ల వంతున ట్రేడైంది.