బిజినెస్

ఓఎన్‌జీసీ, ఐఓసీలకు ఇద్దరు కొత్త డైరెక్టర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 5: ప్రభుత్వ రంగ సంస్థలు చమురు, సహజవాయుల కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ)ల బోర్డుల్లో సోమవారం ఇద్దరు కొత్త డైరెక్టర్ల నియామకం జరిగింది. ఇందులో భాగంగా రాజేష్‌కుమార్ శ్రీవాత్సవ ఓఎన్‌జీసీ ఎక్స్‌ప్లొరేషన్ విభాగంలో డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఇప్పటి వరకు పనిచేసిన ఏకే ద్వివేదీ పదవీ కాలవ్యవధి గతవారం పూర్తి కావడంతో ఆయన స్థానంలో రాజేష్‌కుమార్ శ్రీవాత్సవను నియమించినట్టు ఈ ప్రభుత్వ రంగ కంపెనీ తెలిపింది. అలాగే సందీప్ కుమార్ గుప్తా ఐఓసీ ఆర్థిక విభాగం డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఇప్పటి వరకు పనిచేసిన ఏకే శర్మ గత మే లో ఉద్యోగ విరమణ చేయడంతో ఆయన స్థానంలో సందీప్‌కుమార్ గుప్తాను నియమించినట్టు ఐఓసీ తెలిపింది. కాగా శ్రీవాత్సవ లక్నో విశ్వవిద్యాలయం నుంచి పోస్టుగ్రాడ్యుయేషన్ చేశారు. అలాగే కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాజీస్ నుంచి ఇంజనీరింగ్, జియాలజీల్లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. ఆయన ఓఎన్‌జీసీలో భూగర్భ శాస్తవ్రేత్తగా 1984 నుంచి కృష్ణాగోదావరి బేసిన్, రాజమండ్రిలో పనిచేశారు. అలాగే గుప్తా కామర్స్ గ్రాడ్యుయేట్, చార్టెడ్ అకౌంటెంట్ కూడా. ఆయన ఐఓసీలోని కార్పొరేట్ ఫైనాన్స్ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆయన కార్పొరేట్ అకౌంట్స్, ట్రెజరీ, ఇనె్వస్ట్‌మెంట్స్, అప్రైజల్, రిస్క్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గానూ, చీఫ్ రిస్క్ ఆఫీసర్ ఇన్ చార్జిగానూ పనిచేశారు.