బిజినెస్

జూలైలో మరింత వేగవంతమైన సేవారంగ పరిశ్రమల వృద్ధిరేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 5: దేశీయ సేవా రంగ కార్యకలాపాలు గడచిన జూలై మాసంలో వృద్థి మార్గంలోకి మళ్లాయి. 2016 అక్టోబర్ నుంచి మారిన వాణిజ్య పరిస్థితులతో మంచి ఆర్డర్లు వేగవంతంగా రావడం వల్ల ఆ సానుకూల పరిణామం నెలకొంది. ఐహెచ్‌ఎస్ మార్కిట్ ఇండియా వాణిజ్య సేవల సూచీ జూలై 53.8 శాతం వృద్ధిని, అంతకుముందు జూన్‌లో 49.6 శాతం వృద్ధిని నమోదు చేయడాన్నిబట్టి దేశంలో కేవలం ఓ ఏడాదిలోనే సేవారంగంలో చోటుచేసుకున్న వృద్ధివేగాన్ని అంచనా వేయవచ్చని నిపుణులు అభిప్రాపడుతున్నారు. ‘పాయింట్ ఆఫ్ మాగ్జిమమ్ ఇంపల్స్‌మెంట్’ గణాంకాల మేరకు కొత్త వర్క్ ఆర్డర్లు గత మూడేళ్ల నుంచి శీఘ్రగతిలో రావడం మొదలైందని ఐహెచ్‌ఎస్ మార్కిట్ ప్రిన్సిపాల్ ఎకానమిస్ట్ పోలియన్నా డీ లిమా తెలిపారు. ప్రధానంగా తయారీ, సేవా రంగ పరిశ్రమలు జూలైలో 8నెలల గరిష్ట స్థాయి వృద్ధిరేటు 53.9 శాతం, జూన్‌లో 50.9 శాతం నమోదు చేశాయన్నారు. ప్రచారం, మార్కెటింగ్ వంటివి పెంచుకుంటే ఈ పరిశ్రమలు రాబోయే 12 నెలల కాలానికి గణనీయ వృద్ధిని నమోదు చేసే అవకాశాలున్నాయని లిమా తెలిపారు. ప్రధానంగా ఆర్బీఐ రెపోరేట్ల కోతతో ఈ రంగాలకు చేయూత లభించిందన్నారు.