బిజినెస్

రాష్ట్రంలో తొలి నగదు రహిత గ్రామం గుంకలాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం : రాష్ట్రంలో తొలి నగదు రహిత గ్రామంగా విజయనగరం మండలంలోని గుంకలాం గ్రామాన్ని, తొలి డిజిటల్ జిల్లాగా విజయనగరాన్ని ఎంపిక చేసినట్టు ఎస్‌బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ మణి పల్వేశన్ చెప్పారు. శనివారం మండలంలోని గుంకలాంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా రిజర్వ్ బ్యాంకు రాష్ట్రంలో విజయనగరం జిల్లాను డిజిటల్ జిల్లాగా ఎంపిక చేసిందని వివరించారు. ఇకపై గుంకలాం గ్రామంలో లావాదేవీలన్నీ పూర్తిగా నగదు రహితంగా బయోమెట్రిక్ పద్ధతిలో జరుగుతాయన్నారు. గ్రామంలో చిరు వ్యాపారుల నుంచి అన్ని చోట్లా డిజిటల్ విధానంలో లావాదేవీలు జరిపేందుకు వీలుగా గ్రామంలో 88 బయోమెట్రిక్ యంత్రాలను ఉచితంగా అందజేశామన్నారు. డీఆర్వో వెంకటరావు మాట్లాడుతూ బయోమెట్రిక్ లావాదేవీలను అత్యంత సులభంగా నిర్వహించవచ్చన్నారు. ఈ గ్రామంలో ప్రతి చెల్లింపును వేలి ముద్రల ద్వారానే చేస్తారని ఎస్‌బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ సత్యనారాయణ ప్రసాద్ చెప్పారు. కార్యక్రమంలో లక్కిడాం బ్రాంచి మేనేజర్ ఉష, సూర్యనారాయణమూర్తి పాల్గొన్నారు.
చిత్రం...కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎస్‌బీఐ సీజీఎం మణిపల్వేశన్, డీఆర్వో వెంకటరావు, తదితరులు