బిజినెస్

జర్మనీ వర్సిటీతో గీతం అవగాహన ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 3: ఆధునిక వ్యవసాయం, ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమ, నర్సింగ్ వృత్తి నైపుణ్యం, జియోమోటిక్స్, ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్చర్ వంటి అంశాల్లో ప్రపంచ ఖ్యాతినార్జించిన జర్మనీకి చెందిన యూనివర్శిటీ ఆఫ్ అప్లైడ్ సైనె్సస్ న్యూ బ్రాండెన్ బర్గ్‌తో గీతం డీమ్డ్ యూనివర్శిటీ అవగాహన కుదుర్చుకుంది. గీతంలో శనివారం జరిగిన కార్యక్రమంలో వైస్‌ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ కె. శివరామకృష్ణ, ప్రో వైస్‌ఛాన్స్‌లర్ కె. శివప్రసాద్, గీతం సంయుక్త కార్యదర్శి ఎం భరద్వాజ్‌ల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. గీతం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కేవీజెడీ బాలాజీ, జర్మనీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ ఇంగ్ ఆండ్రూస్‌లు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి పరస్పరం మార్చుకున్నారు. దీనిలో భాగంగా సంయుక్త సదస్సులు, పరిశోధనలు, సాంకేతిక పత్రాల ప్రచురణ, విద్యార్థులు, అధ్యాపకులను పరస్పరం ఆహ్వానించుకోవడం వంటి చర్యలు చేపడతారు. ఈ సందర్భంగా గీతం వైస్‌ఛాన్స్‌లర్ శివరామకృష్ణ మాట్లాడుతూ సాంకేతికంగా జర్మనీ ఎంతో సాంకేతిక ప్రగతి సాధిస్తోందని, గీతం అంతర్జాతీయ మేథో సహకారంలో భాగంగా న్యూబ్రాండెన్ బర్గ్‌తో సంబంధాలు బలోపేతం చేసుకుంటామన్నారు. ఇప్పటికే రష్యా, అమెరికా, యూకే తదితర దేశాల్లోని ప్రముఖ విశ్వవిద్యాలయాలతో తమకు అనుబంధం ఉందన్నారు. ఈ విధమైన పరస్పర సహకారం ద్వారా సాంకేతిక రంగంతో పాటు సామాజిక, వాణిజ్య రంగాలపై విద్యార్థులకు అంతర్జాతీయ మార్పులపై అవగాహన ఏర్పడుతుందన్నారు. జర్మనీ విశ్వవిద్యాలయం ప్రతినిధి డాక్టర్ ఇంగ్ ఆండ్రూస్ మాట్లాడుతూ తమ విశ్వవిద్యాలయంలోని అత్యాధునిక ప్రయోగశాలలు గీతం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఒప్పందంలో భాగంగా అందుబాటులో ఉంచుతామన్నారు. అండర్ గ్రాడ్యుయేట్ వరకూ జర్మనీ భాషలో బోధన జరుగుతుందని, పీజీ నుంచి ఆంగ్లంలో బోధన ఉంటుందన్నారు. ఇప్పటికే భారతీయ విద్యార్థులు పెద్ద సంఖ్యలో తమ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్నారని తెలిపారు. భారతదేశంలోని విశ్వవిద్యాలయాలతో తమ అనుంబంధం గీతంతో ప్రారంభం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గీతం అంతర్జాతీయ విద్యార్థి వ్యవహారాల డైరెక్టర్ కేపీ కిషన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగాధిపతి కే తమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చిత్రం... ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న జర్మనీ, గీతం వర్సిటీల ప్రతినిధులు