బిజినెస్

‘రెలిగేర్’ మాజీ యజమానుల ఇళ్లలో ఈడీ సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 1: మనీల్యాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘రెలిగేర్’ మాజీ యజమానులు, సోదరులు మల్వీందర్ మోహన్ సింగ్, శివీందర్ మోహన్ సింగ్, వారి అనుచరులకు చెందిన పలు నివాస స్థలాలు, ఆస్తులపై ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం విస్తృత దాడులు నిర్వహించింది. ఢిల్లీలోని మొత్తం ఏడు ప్రాంతాల్లో సింగ్ సోదరులతోబాటు రిలీగేర్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (ఆర్‌ఈఎల్) మాజీ సీఎండీ సునీల్ గోధ్వానీ, ఎగ్జిక్యూటివ్‌లు ఎన్‌కే గోషల్, హేమంత్ దింగ్రాకు చెందిన నివాసాల్లో సోదాలు నిర్వహించామని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఢిల్లీ పోలీసు ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యు) గత ఏడాది డిసెంబర్‌లో చేసిన ఫిర్యాదు మేరకు తాము దాడులు నిర్వహించామన్నారు. ఆర్‌ఈఎల్ అనుబంధ సంస్థ ’రెలీగేర్ పిన్‌వెస్ట్ (ఆర్‌ఎఫ్‌ఎల్) రూ. 740 కోట్లమేర జరిగిన మోసాలకు సంబంధించి సింగ్ సోదరులపై ఈఓడబ్ల్యుకు ఫిర్యాదు చేయడం జరిగిందని ఈడీ అధికారులు వెల్లడించారు.
కాగా తమ గ్రూపు సంస్థలు చిక్కుల్లో పడేందుకు గోధ్వానీ కారకుడని సింగ్ సోదరులు ఆరోపిస్తున్నారు. కాగా మోసం, నమ్మక ద్రోహం, దుర్వినియోగం, ఫోర్జరీ వంటి అనేక నేరాల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఈడీ అధికారులు తెలిపారు.