బిజినెస్

స్వల్పంగా పెరిగిన సెనె్సక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 31: బాంబే స్టాక్ ఎక్స్ఛేంజి (బీఎస్‌ఈ)లో బుధవారంనాడు లావాదేవీలు సానుకూల వాతావరణంలో జరగడంతో సెనె్సక్స్ స్వల్ప లాభాలను ఆర్జించగలిగింది. ఆరంభంలో నష్టాల పరంపర కొనసాగినప్పటికీ ఆ తర్వాత క్రమంగా పుంజుకుంది. మదుపరులు ఆసక్తిని ప్రదర్శించడంతో సెనె్సక్స్ లాభాల బాట పట్టింది. 83.88 పాయింట్లు పెరిగిన సెనె్సక్స్ 37,481.12 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌బ్యాంక్ షేర్లు అత్యధికంగా 6.04 శాతం లాభాలను ఆర్జించాయి. ఇండస్‌ఇండ్ 5.32 శాతం, టాటా స్టీల్స్ 4.15 శాతం, హీరో మోటార్స్ 4 శాతం, సన్‌ఫార్మా 3.96 శాతం చొప్పున లాభాల్లో ట్రేడయ్యాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్ల కోత నిర్ణయాన్ని తీసుకోనున్నదన్న సమాచారం స్టాక్‌మార్కెట్‌లో ప్రభావం చూపించింది. ఫలితంగానే ఇటీవల కాలంలో బలహీనంగా మారిన స్టాక్‌మార్కెట్ ట్రేడింగ్ బుధవారం బలాన్ని సంతరించుకుంది. అయితే, సానుకూల ధోరణులు ఉన్నప్పటికీ యాక్సిస్ బ్యాంక్ షేర్లు 4.55 శాతం నష్టపోయాయి. అదేవిధంగా భారతీ ఎయిర్‌టెల్ (2.66 శాతం), రిలయన్స్ (1.23 శాతం), ఎన్టీపీసీ (0.71 శాతం), మారుతీ సుజుకీ (0.6 శాతం) చొప్పున నష్టాలను ఎదుర్కొన్నాయి.
బీఎస్‌ఈలో మాదిరిగానే జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ స్వల్ప లాభాల్లో ముగిసింది. 32.60 శాతం లాభపడిన నిఫ్టీ 11,118 పాయింట్ల వద్ద ముగిసింది. ఇండస్‌ఇండ్ అత్యధికంగా 5.29 శాతం లాభాలను ఆర్జించింది. టాటా స్టీల్స్ 4.32 శాతం, ఎస్‌బ్యాంక్ 4.24 శాతం, ఐఓసీ 3.93 శాతం, హీరో మోటార్స్ 3.90 శాతం చొప్పున లాభాలను సంపాదించాయి. కాగా, జీఎంటర్‌టైన్‌మెంట్ అత్యధికంగా 5.25 శాతం నష్టపోయింది. అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్ షేర్లు 4.64 శాతం నష్టాలను చవిచూశాయి. భారతీ ఎయిర్‌టెల్ (2.82 శాతం), టైటాన్ (2.30 శాతం), భారతీ ఇన్‌ఫ్రా (2.12 శాతం) కూడా నష్టాల్లో ట్రేడయ్యాయి.