బిజినెస్

సరుకు రవాణాలో సికింద్రాబాద్ జోన్ టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 31: దేశంలో గణనీయంగా ఆదాయాన్ని సంపాధిస్తున్న రైల్వే జోన్లలో దక్షిణ మధ్య రైల్వే (సికింద్రాబాద్) జోన్ మరోసారి రికార్డులు సృష్టించింది. జోన్ చరిత్రలో అన్ని విభాగాల్లో పనితీరును మెరుగుపర్చుకుని తన ప్రగతిని చాటుకుంది. 2018-19 ఆర్థిక సంవత్సరం అఖిల భారత స్థాయిలో తన జోన్ పరిధిలో పనితీరును శభాష్ అంటూ ప్రశంసలతో నాలుగు అవార్డులను దక్కించుకుంది. ముంబయ్‌లో జరిగిన 64వ రైల్వే వారోత్సవాల సందర్భంగా జోన్ పనితీరుపై రైల్వే బోర్డు చైర్మన్ వినోద్‌కుమార్ జోన్ అధికారులకు అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రైల్వే బోర్డు చైర్మన్ వినోద్‌కుమార్ మాట్లాడుతూ దేశంలో దక్షిణ మధ్య రైల్వే జోన్ (సికింద్రాబాద్) అన్ని విభాగాల్లో ప్రగతిని సాధించిందన్నారు. ఈ ప్రగతికి చిహ్నంగా జోన్‌కు నాలుగు అవార్డులు ప్రకటించామన్నారు. సికింద్రాబాద్ రైల్వే జోన్ రవాణాలో అత్యధికంగా 122.51 మిలియన్ టన్నుల సరుకును సరఫరా చేసిందన్నారు. ఈ వృద్ధి గత ఏడాది కంటే 30 శాతం ఎక్కువ అన్నారు. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 2152 ప్రత్యేక రైళ్ళు ఏర్పాటుతో 30 లక్షల మంది ప్రయాణీకులను గమ్యస్థానానికి చేర్చిన ఘనత సికింద్రాబాద్ జోన్‌కు దక్కిందన్నారు. ప్రత్యేక రైళ్ళకు దాదాపు 10 వేల అధనపు కోచ్‌లు ఏర్పాటుతో ప్రయాణీకుల రద్దీని నిలువరించామన్నారు. పర్యావరణ పరిరక్షణ దిశగా యూనిక్ ఈ- సెటిల్‌మెంట్, ఈ- ఆఫీసు నిర్వహించడం జరిగిందన్నారు. స్టోర్స్ విభాగంలో స్క్రాప్ విక్రయించడం ద్వారా రూ. 340 కోట్లు సాధించినట్లు ఆయన గుర్తు చేశారు.
చిత్రం...రైల్వే బోర్టు చైర్మన్ వినోద్‌కుమార్ నుంచి అవార్డులు అందుకుంటున్న ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ శివప్రసాద్, ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ ఎన్‌వీ రమణారెడ్డి