బిజినెస్

రతుల్ పూరీ బినామీ వాటాల అటాచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ మేనల్లుడు రతుల్ పూరీకి చెందిన సుమారు రూ. 254 కోట్ల విలువైన బినామీ వాటాలను సోమవారం నాడు ఆదాయ పన్నుల శాఖ అటాచ్ చేసింది. వీవీఐపీ హెలికాప్టర్ (చాపర్) కుంభకోణంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి డొల్ల కంపెనీ ద్వారా ఆ సొమ్ము వాటాల రూపంలో రతుల్‌పూరీకి అందినట్టు ఆరోపణలున్నాయి. హిందుస్థానీ పవర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు రతుల్‌పూరీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. పన్ను ఎగవేత, మనీల్యాండరింగ్ వంటి ఆరోపణలతో ఇప్పటికే ఆయన ఆదాయ పన్ను, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ల విచారణను ఎదుర్కొంటున్నారు. కాగా బినామీ ఆస్తుల లావాదేవేల నివారణ చట్టం కింద ఢిల్లీకి చెందిన ఆదాయ పన్ను శాఖ కార్యాలయం అధికారులు రుతల్‌పూరీకి చెందిన బినామీ వాటాలు లేదా అసంచిత నిర్బంధ మార్పులు చేయాల్సిన ప్రాధాన్యత కలిగిన వాటాలు (సీసీపీసీలు) అటాచ్ చేయాల్సిందిగా ప్రాథమిక ఆదేశాలు జారీ చేశారు. ఈ నిధులను రతుల్‌పూరీ తండ్రి దీపక్‌పూరీకి చెందిన ‘మోసర్ బాయర్’ కంపెనీకి అనుబంధంగా ఉన్న ‘ఆప్టిమా ఇన్‌ప్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్’లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ)కింద సమీకరించినట్టు నిందితుడు చెబుతున్నాడని అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఇలావుండగా ఈ రూ. 254 కోట్ల పెట్టుబడులను మరోగ్రూప్ కంపెనీ ‘హెచ్‌ఈపీఎల్’ అధిక ఇన్వాయిస్‌ల ద్వారా సౌర విద్యుత్ ప్యానళ్లను దిగుమతి చేసుకునే సాకుతో సమీకరించిందని, ఆ తర్వాత దుబాయ్‌కి చెందిన రాజీవ్ సక్సేనా నేతృత్వంలోని మారిషస్ డొల్ల కంపెనీ ‘రీగల్ పవర్ లిమిటెడ్’ సహాయంతో రతుల్‌పూరీ ఖాతాల్లోకి వాటాల రూపంలో జమచేసినట్టు ఆదాయ పన్ను శాఖ అధికారులు ఆరోపిస్తున్నారు. ఆప్టిమా ఇన్‌ప్రాస్ట్రక్చర్‌లో ఆ మొత్తం జమ అయిన వెంటనే మరో గ్రూప్ సంస్థ ‘యునోకాన్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీకి వాటాల కింద మళ్లించారని ఈ కంపెనీ రతుల్ పూరీకి చెందినదని అధికారులు ఈ కుంభకోణం జరిగిన తీరును వివరించారు.
రాజీవ్ సక్సేనా ఇప్పటికే అగస్టావెస్ట్‌ల్యాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణంలో అభియోగాలను ఎదుర్కొంటున్నాడు. ఇతన్ని గత జనవరిలో భారత దర్యాప్తు సంస్థలు దుబాయ్ నుంచి భారత్‌కు తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అతన్ని అరెస్టుచేసి అతనితోబాటు ఆ కేసులో రతుల్‌పూరీని సైతం ప్రశ్నించడం జరిగింది. కాగా తాజాగా రూ. 254 కోట్ల విలువైన బినామీ వాటాలకు రతుల్‌పూరీయే లబ్ధిదారుడైన యజమానిగా గుర్తించామని, అందుకే అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని ఆదాయ పన్ను శాఖ అధికారులు పేర్కొంటున్నారు.