బిజినెస్

శ్రీసిటీని సందర్శించిన తైవాన్ బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్యవేడు, జూలై 30: తైవాన్ దేశానికి చెందిన సీఎన్‌సీ మెషీన్ టూల్స్ తయారీ రంగానికి చెందిన 14 మంది వ్యాపారవేత్తల ప్రతినిధుల బృందం టీజేఆర్ ప్రెషిషన్ టెక్నాలజీ సీఈఓ చెన్‌ఇంగ్‌షూ నేతృత్వంలో శ్రీసిటీలో మంగళవారం పర్యటించారు. వీరికి ఫౌండేషన్ ప్రెసిడెంట్ రమేష్ సుబ్రహ్మణ్యం స్వాగతం పలుకగా శ్రీసిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శివశంకర్ పారిశ్రామిక ప్రగతి, వౌళిక వసతుల ప్రత్యేకతలను వివరించారు. పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చే పెట్టుబడి దారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ప్రత్యేక ప్రోత్సాహకాలను విశదీకరించారు. శ్రీసిటీలో ప్రపంచ శ్రేణి వౌలిక వసతులు చాలా బాగున్నాయని చెన్ ఇంగ్ షూ తెలిపారు. ఇక్కడ పలు తైవాన్ మిషీన్ టూల్స్ తయారీ పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తాయన్నారు. అనంతరం శ్రీసిటీ పరిసరాలను చుట్టిచూసి అనేక అంశాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.

చిత్రం... శ్రీసిటీని సందర్శించిన తైవాన్ బృందంతో శ్రీసిటీ ప్రతినిధులు