బిజినెస్

రాష్ట్రంలో తగ్గుతున్న విమాన సర్వీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 30: రాష్ట్రంలో విమాన సర్వీసులు గణనీయంగా తగ్గిపోతున్నాయని దీని వలన పెట్టుబడిదారులు వెనక్కిపోయే ప్రమాదం ఉందంటూ శాసనసభ ప్రశ్నోత్తరాల్లో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు పీజీవీఆర్ నాయుడు, వాసుపల్లి గణేష్‌కుమార్, ఆదిరెడ్డి భవానీ, వల్లభనేని వంశీమోహన్ అడిగిన ఓ ప్రశ్నకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి బదులిస్తూ గత నెల 30వ తేదీ నుంచి సింగపూర్-విజయవాడ మధ్య అంతర్జాతీయ విమాన రాకపోకలు నిలిచిపోయాయని అన్నారు. తిరుపతి - విజయవాడ - విశాఖ మార్గంలో నష్టాలను చవిచూస్తున్న అలియన్స్ ఎయిర్ సంస్థ ఆ మార్గంలో విమాన రాకపోకలను తగ్గించిందన్నారు. అయితే కనెక్టివిటీని పెంచేందుకు విమానయాన సంస్థలను సమన్వయ పరుస్తున్నామని త్వరలో విమానయాన సంస్థల సదస్సును నిర్వహిస్తామన్నారు. గతంలో సింగపూర్, మలేషియాల విమానయాన సంస్థలతో నష్టాలను భరించే షరతుపై చంద్రబాబు కొంతకాలం విమానాలను నడిపించారని అయితే నిరవధికంగా అలా భరించడమనేది అసాధ్యమన్నారు. సభ్యులు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ విమాన సర్వీసుల పెంపునకు ప్రభుత్వం కృషి చేయాలని కోరారు.