బిజినెస్

మార్కెట్లను నిర్దేశించనున్న కంపెనీల త్రైమాసిక ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 21: ప్రముఖ కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఈ వారం స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులను నిర్దేశించనున్నాయని మార్కెట్ విశే్లషకులు పేర్కొంటున్నారు. ప్రధానంగా హెచ్‌యూఎల్, మారుతి సుజుకీ, కోటక్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌ల ఫలితాలు మార్కెట్‌ను అధికంగా ప్రభావితం చేస్తాయంటున్నారు. మొత్తం వాణిజ్య సెంటిమెంటు ప్రస్తుతం బలహీనంగా ఉంది. అంతేకాకుండా ఈ వారం ఊగిలాటకు గురయ్యే అవకాశా లూ ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం పన్నుల విధింపు, ఇప్పటి వరకు విడుదలైన కొన్ని కంపెనీలు ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతోబాటు, వినిమయం సైతం తగ్గిపోవడమే. గత వారం సెనె్సక్స్ ఈ ఏడాదికే రెండో భారీ స్థాయి నష్టాలను చవిచూసింది. ప్రత్యేకించి గత వాణిజ్య వారం ముగింపు రోజైన శుక్రవారం సెనె్సక్స్ భారీగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఎఫ్‌పీఐలపై పన్ను మినహాయింపునకు అవకాశాలు లేవని ప్రభుత్వం సూచనప్రాయంగా తెలియజేయడం మార్కెట్లకు ఆశనిపాతంలా మారింది. కాగా సోమవారం వెలువడనున్న రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ త్రైమాసిక నివేదికలను అనుసరించి మదుపర్లు స్పందించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఇటు దేశీయంగానూ, అటు అంతర్జాతీయంగానూ మార్కెట్లు అనిశ్చిత పరిస్థితుల్లో ఉన్నా యి. గత శుక్రవారం త్రైమాసిక ఫలితాలు విడుదల చేసిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభాల్లో 6.8 శాతం వృద్ధిని మొత్తం రూ.10,104 కోట్ల మొత్తాన్ని చూ పింది. మొత్తం మార్జిన్లలో కంపెనీ వినిమయ రం గంలోని రీటైల్ వ్యాపారం, టెలికాం వ్యాపారాల్లో చోటుచేసుకున్న వృద్ధివల్లే లాభాలు సాధ్యమైందని నివేదిక వెల్లడించింది. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాం కు శనివారం విడుదల చేసిన త్రైమాసిక ఫలితాల్లో 18.04 శాతం లాభాల వృద్ధిని చూపింది. నికరలాభాన్ని రూ. 5,676.06 కోట్ల మొత్తాన్ని చూపింది. ప్రధాన్యతా రంగాల ఆదాయం, నియంత్రించిన మొండి రుణ బకాయిల విధానాలు ఈ లాభాలకు కారణమని ఆ బ్యాంకు తెలిపింది. ఇలావుండగా ఈ నెల 30,31 తేదీల్లో జరిగే అమెరికా ఫెడరల్ విధాన నిర్ణాయక సమావేశంలో తీసుకునే నిర్ణయాలతోబాటు, రుతుపవనాల ప్రభావం, కంపెనీల ఫలితా లు ఈ వారం దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల స్థితిగతులను నిర్దేశిస్తాయని ప్రముఖ విశే్లషకుడు అరు ణ్ తుక్రాల్ అభిప్రాయపడ్డారు. ఓ వైపుఆర్థికంగా మందగమన సమస్యలు మార్కెట్లకు ఇబ్బందికరంగా ఉన్నా మూడేళ్లకు పైబడి దీర్ఘకాలిక పెట్టుబడులు మదుపుచేసేవారికి అనుకూలంగా ఉందని ఆ య న తెలిపారు. కాగా అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు, రూపాయి మారకం విలువ సైతం సెంటిమెంటును ప్రభావితం చేయనున్నాయి.