బిజినెస్

స్వల్పంగా నష్టపోయిన సూచీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 24: అంతర్జాతీయంగా అమెరికా-ఇరాన్ మధ్య తీవ్ర స్థాయిలో నెలకొన్న ఉద్రిక్తల క్రమంలో చమురు, సహజ వాయులు, లోహ స్టాక్స్ తీవ్ర నష్టాలకు గురయ్యాయి. దీంతో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప నష్టాలను నమోదు చేశాయి. తొలుత 300 పాయింట్లు ఎగబాకిన బీఎస్‌ఈ సూచీ సెనె్సక్స్ ఆ తర్వాత తీవ్ర ఒడిదుడుకులకు గురైంది. చివరిగా 71.53 పాయింట్లు కోల్పోయి 0.18 శాతం నష్టాలతో 39,122.96 వద్ద దిగువన స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ ఒక దశలో 39,021.96 పాయింట్ల కనిష్టాన్ని, మరో దశలో 39,300.02 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. అలాగే బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ సైతం 24.45 పాయింట్లు కోల్పోయింది. 0.21 శాతం నష్టాలతో 11,699.65 పాయింట్ల దిగువన స్థిరపడింది. ఈ సూచీ సైతం రోజంతా ఒడిదుడుకులకు గురైంది. ఒక దశలో 11,699.65 పాయింట్ల కనిష్టాన్ని, మరో దశలో 11,754 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. సెనె్సక్స్ ప్యాక్‌లో ఓఎన్‌జీసీ అత్యధికంగా 3.48 శాతం నష్టపోయింది. టాటాస్టీల్, వేదాంత, బజాజ్ ఆటో, టెక్‌ఎం, ఆర్‌ఐఎల్, హీరోమోటో కార్ప్, కోటక్ బ్యాంక్, ఆక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్ సైతం 2.33 శాతం నష్టాలను సంతరించుకున్నాయి. మరోవైపు ఎస్ బ్యాంక్, ఎం అండ్ ఎం, టీసీఎస్, ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, మారుతీ, ఐటీసీ 2.19 శాతం మేర లాభపడ్డాయి. కాగా ఇరాన్‌తో అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడంతో బాటు వాణిజ్యం విషయంలో ఆంక్షలను కఠినతరం చేయడంతో రెండు దేశాల మధ్య వివాదం మరింతగా ముదిరింది. దీంతో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై సైతం పడిందని వ్యాపారులు చెబుతున్నారు. ముడి చమురు ధరలు సోమవారం 0.16 శాతం పెరిగి బ్యారెల్ 64.55 డాలర్ల వంతున పలికింది. కాగా అంతర్జాతీయంగా షాంఘయ్, హాంగ్‌కాంగ్, టోక్యో, సియోల్ మార్కెట్లు లాభాల్లో ముగియగా, ఐరోపా మార్కెట్లు ఆరంభ ట్రేడింగ్‌లో నష్టాలనే చవిచూశాయి.
బలపడిన రూపాయి
అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ సోమవారం 15 పైసలు లాభపడి మొత్తం 69.43 రూపాయలుగా ట్రేడైంది.