బిజినెస్

హైదరాబాద్‌లో ‘బైక్ స్టూడియో’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 20: హైదరాబాద్ సైక్లింగ్ ప్రియులకు ప్రపంచస్థాయి సైకిళ్లను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా ఓ అత్యాధునిక సైకిల్ షోరూం ‘బైక్ స్టూడియో’ ప్రారంభమైంది. బంజారాహిల్స్‌లోని రోడ్ నెం 12లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఎదురుగా ఈ షోరూంను తెరిచారు. సీనియర్ ఐఎఎస్ అధికారి డి వెంకటేశ్వరరావు, కార్పొరేటర్ విజయలక్ష్మి లాంఛనంగా ప్రారంభించిన ఈ షోరూం గురించి యజమాని రాకేష్ చౌదరి మాట్లాడుతూ అన్ని వయస్కులవారికి సరిపడేలా సరికొత్త హంగులతో తమ షోరూంలో సైకిళ్లను అందుబాటులో ఉంచామన్నారు. పిల్లలకు, యువతకు నచ్చిన విధంగా కొత్త తరహా సైకిళ్లు తమ వద్ద లభిస్తాయని చెప్పారు. రేసింగ్ సైకిల్స్, రైడింగ్ సైకిల్స్, యాంగ్రీబర్డ్ సైకిల్స్, స్నో సైకిల్స్ వంటి రకాలున్నాయని, థాయలాండ్‌లో ప్రముఖ సైకిళ్ల తయారీదారైన ఎల్‌ఎ సైకిల్స్ భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తున్నామన్నారు.