బిజినెస్

500 ఎకరాల్లో ప్లాస్టిక్ సిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 18: సుల్తాన్‌పూర్‌లో మొదటి దశగా వంద ఎకరాల్లో ప్లాస్టిక్ పార్క్‌ను, రెండవ దశలో మూడు నుంచి ఐదువందల ఎకరాల్లో నిమ్జ్‌లో ప్లాస్టిక్ సిటీని ఏర్పాటు చేయనున్నట్టు ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. వచ్చే నాలుగేళ్లలో తెలంగాణను వ్యాపార, వాణిజ్య రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఒక రోజు ముంబై పర్యటనలో ఉన్న కెటిఆర్‌ను పలువురు వ్యాపార దిగ్గజాలు కలిశారు. పలు సమావేశాల్లో కెటిఆర్ పాల్గొన్నారు. ప్లాస్టిక్ పరిశ్రమపై ముంబైలో జరిగిన నాలుగవ అంతర్జాతీయ సదస్సులో కెటిఆర్ పాల్గొన్నారు. మన దేశానికి చెందిన వారితో పాటు వివిధ దేశాలకు చెందిన 600 మంది ప్లాస్టిక్, పెట్రో కెమికల్, ప్యాకేజింగ్ రంగాల పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన కెటిఆర్ పారిశ్రామిక వేత్తలను ఉద్దేశించి మాట్లాడారు. నాలుగేళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు సాగిస్తున్న కృషిని వివరించారు. ముఖ్యంగా ఐటి, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, లైఫ్ సైనె్సస్, ఏరోస్పెస్, రక్షణ రంగాల్లో తెలంగాణను ముందంజలో ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ ఇప్పటికే ఈ రంగాల్లో వేగవంతంగా పురోగమి స్తోందని, పారిశ్రామిక విధానం, ఫార్మాసిటీ వంటి రంగాల్లో ముందుందని తెలిపారు. తెలంగాణలో గత రెండేళ్లలో నిరంతర విద్యుత్ సరఫరా, టియస్‌ఐపాస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మెరుగుదల వంటి అంశాలతో దేశంలోనే పెట్టుబడులకు అత్యుత్తమ స్నేహ పూరిత వాతావరణం కలిగిన రాష్ట్రంగా ఉందని తెలిపారు. తెలంగాణలో అందుబాటులో ఉన్న ల్యాండ్ బ్యాంక్ పెట్టుబడులకు మరో అదనపు అనుకూల అంశం అని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్లాస్టిక్ పరిశ్రమలు పెట్టే వారికి ప్రోత్సాహకాలు ఇస్తోందని చెప్పారు. దీంతో పాటు ఆయా పెట్టుబడులకు, పరిశ్రమలు పెట్టే వారికి ఇచ్చే పలు ప్రోత్సాహకాలను మంత్రి సమావేశానికి హాజరైన పరిశ్రమల ప్రతినిధులకు వివరించారు. రాయితీలు, ప్రోత్సాహకాలు, టిఎస్‌ఐపాస్ గురించి కెటిఆర్ ఇచ్చిన ప్రజంటేషన్‌పై పలువురు పారిశ్రామిక వేత్తలు అభినందనలు తెలిపారు.
ఆర్‌బిఐ గవర్నర్‌తో భేటీ
ఆర్‌బిఐ గవర్నర్ రఘురామ్ రాజన్‌ను కెటిఆర్ ముంబైలో గురువారం కలిశారు. ఎంఎస్‌ఎంఇ సెక్టార్‌లోని పరిశ్రమలు బ్యాంకు రుణాలు అందుకోవడంలో ఉన్న పలు సమస్యలను మంత్రి గవర్నర్‌కు వివరించారు. దీంతో పాటు పలు యంయస్‌యంఇ రంగ సమస్యలను మంత్రి తెలిపారు. ఈ రంగంలోని పరిశ్రమలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతున్న చర్యల గురించి వివరించి, సూచనలు తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున రాజన్‌కు కెటిఆర్ జ్ఞాపికను అందజేశారు.

చిత్రం.. ప్లాస్టిక్ పరిశ్రమపై సదస్సులో ప్రసంగిస్తున్న కెటిఆర్