బిజినెస్

విస్తరణ దిశగా ఒఎన్‌జిసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఆగస్టు 18: ఆఫ్‌షోర్ వ్యాపార ప్రాజెక్టుల విస్తరణ ద్వారా క్షేత్ర కార్యకలాపాలను పెద్ద ఎత్తున విస్తరించే దిశగా ప్రభుత్వ రంగ సంస్థ ఒఎన్‌జిసి సన్నాహాలు చేస్తోంది. ఈస్ట్రన్ ఆఫ్‌షోర్ అసెట్ (కాకినాడ) ఆధ్వర్యంలో చమురు, సహజవాయు నిక్షేపాల అనే్వషణకు ఈ సంస్థ చురుగ్గా ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇందుకు తూర్పు కోస్తాలో డీప్ వాటర్ అభివృద్ధి ప్రాజెక్టును ఏర్పాటుచేయనున్నట్టు ప్రకటించింది. దీనివలన ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం అనూహ్యంగా అభివృద్ధి సాధిస్తుందని స్పష్టంచేసింది. ఒఎన్‌జిసి డైమండ్ జూబ్లీ వేడుకలను పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఆ సంస్థ చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించింది. సామాజికాభివృద్ధికి ఒఎన్‌జిసి కాకినాడ అసెట్ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను తెలియజేసింది. జాతికి ఇంధన భద్రతను అందించడంలో ప్రభుత్వ రంగ సంస్థ ఒఎన్‌జిసి కీలక భూమిక పోషిస్తోందని, సంస్థ వ్యాపార ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వానికి ఉపయోగపడుతూనే, ప్రజలకు సామాజిక బాధ్యత క్రింద అనేక విధాలుగా సేవ చేస్తున్నట్టు పేర్కొంది. ఈనెల 14వ తేదీ నాటికి ఒఎన్‌జిసి 60 వసంతాలు పూర్తిచేసుకుని, డైమండ్ జూబ్లీ వేడుకలను జరుపుకుంటున్నట్టు అధికారులు చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా ఓడలరేవులోని ఆన్‌షోర్ బేస్ గ్యాస్ టెర్మినల్ అభివృద్ధి దిశగా పయనిస్తోందన్నారు. దేశానికి ఇంధన భద్రతను అందించడానికి సంస్థ మరింత వేగంగా కార్యకలాపాలను విస్తరించడానికి సన్నాహాలు చేస్తోందన్నారు. సహజవాయువు అనే్వషణ, అభివృద్ధి కోసం డీప్ వాటర్ అభివృద్ధి ప్రాజెక్టును ఏర్పాటుచేయనున్నట్టు పేర్కొన్నారు. సంస్థ వ్యాపార కార్యకలాపాలను విస్తరించుకుంటూనే, సామాజికాభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నట్టు తెలియజేశారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీలో భాగంగా ఓడలరేవు గ్రామాభివృద్ధికి సంస్థ ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. ఈస్ట్రన్ ఆఫ్‌షోర్ అసెట్ (కాకినాడ) ఆధ్వర్యంలో తాజాగా ఈ గ్రామానికి రూ.10,56,299 వ్యయంతో వీధి సౌర దీపాలను ఏర్పాటుచేశారు. జిల్లాలోని తొండంగి మండలం ఎవి నగరం గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణానికి సంస్థ ముందుకువచ్చింది. ఈ గ్రామం మొత్తానికి సిసి రోడ్ల నిర్మాణానికి 70 లక్షలు వ్యయం అంచనా వేయగా, ఇందులో 30లక్షలు ఒఎన్‌జిసి మంజూరు చేస్తుండగా, మిగిలిన 30 లక్షలను ఎన్‌ఆర్‌ఇజిఎస్ ద్వారా మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకువచ్చింది. ఇందుకు సంబంధించి రూ.17.50 లక్షల చెక్కును ఈస్ట్రన్ ఆఫ్‌షోర్ అసెట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అసెట్ మేనేజర్ అలోక్‌నందన్ జిల్లా అధికారులకు అందజేశారు. సుమారు 9 లక్షల 97వేల నిధులతో కాకినాడ ఐటిఐటిలో ఆర్వో ప్లాంటు, మరుగుదొడ్లను ఒఎన్‌జిసి నిర్మించింది. ఉమా ఎడ్యుకేషనల్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థకు సామాజిక బాధ్యత క్రింద రూ.13,54,754 రూపాయల వ్యయంతో బస్సును కొనుగోలు చేసి ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యం, విద్య, లింగ సమానత్వం, మహిళా సాధికారత, సామాజికాభివృద్ధి తదితర అంశాల్లో ప్రభుత్వానికి చేదోడుగా ఒఎన్‌జిసి తమ వంతు కృషి చేస్తున్నట్టు వివరించారు.