బిజినెస్

భారత్‌లో విమానాల తయారీకి భాగస్వాములు అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: దేశంలోనే విమానాల తయారీకి సమర్థులైన భాగస్వాములు అవసరమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభు అన్నారు. రెండేళ్లకోసారి జరిగే ఏరో ఇండియా షోకు హాజరైన ఆయన విలేఖరులతో మాట్లాడుతూ దేశంలో ఏవియేషన్ మార్కెట్ విస్తృతమవుతున్నదని చెప్పారు. ఇంత వరకూ చాలా తక్కువ విమానాశ్రయాలు ఉండేవని, ఇటీవల కాలంలోనే వాటిని పెంచుతున్నామని తెలిపారు. ప్రస్తుతం విమానాశ్రయాల సంఖ్య 103కి చేరిందన్నారు. వచ్చే 15 సంవత్సరాల కాలంలో, 65 బిలియన్ డాలర్ల వ్యయంతో, మరో 100 విమానాశ్రయాలను నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ‘విజన్ 2040’ ప్రకారం దేశానికి కనీసం మరో 2,300 విమానాలు అవసరమవుతాయని పేర్కొన్నారు. పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని, విమానాలను ఎక్కువగా దేశంలోనే తయారు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, ఇందు కోసం సమర్థులైన భాగస్వామ్యాల కోసం వెతుకుతున్నామని వివరించారు.
చిత్రం.. బెంగళూరులోని యెలహంక ఎయిర్‌బేస్‌లో ఏరో ఇండియా 2019 ఎయిర్ షోను బుధవారం అధికారికంగా ప్రారంభిస్తున్న రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభు, కర్నాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి, నేవీ చీఫ్ ఎడ్మిరల్ సునీల్ లన్బా, ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ సింగ్ రావత్, ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా తదితరులు