బిజినెస్

జిఎస్‌టిఎన్‌ని రద్దు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 11: వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) లెక్కలు వసూళ్ల నిర్వహణకోసం యుపిఏ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన సంస్థలో ప్రైవేటు సంస్థలకు మెజారిటీ వాటా ఉండడం పట్ల బిజెపి ఎంపి సుబ్రహ్మణ్యం స్వామి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ సంస్థ స్థానంలో పూర్తిగా ప్రభుత్వ అధీనంలో ఉండే వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. గూడ్స్, సర్వీసెస్ టాక్స్ నెట్‌వర్క్ (జిఎస్‌టిఎన్)ను లోతుగా పరిశీలించాలని ప్రధాని మోదీకి రాసిన లేఖలో స్వామి కోరారు. సెక్యూరిటీ క్లియరెన్స్ లేకుండా అత్యంత సున్నితమైన సమాచారాన్ని చూడడానికి ఒక ప్రైవేటు సంస్థను ఎలా అనుమతిస్తారని కూడా ఆయన ప్రశ్నించారు. జిఎస్‌టిఎన్ కంపెనీలో యాజమాన్య వాటాల వివరాలను ఆయన వివరిస్తూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికీ కలిపి దానిలో 49 శాతం వాటానే ఉందని, మిగతా 51 శాతం వాటాలు విదేశీ వాటా భాగస్వామ్యం కలిగిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎల్‌ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ లాంటి సంస్థలకున్నాయని తెలిపారు. జిఎస్‌టిఎన్‌ఎల్ ప్రాథమిక కసరత్తు కోసమే ఇప్పటివరకు ఖర్చులు, ఫీజులకోసం 4 వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చయిందని ఆయన అంటూ లాభాపేక్ష లేని కంపెనీలో లాభాపేక్ష కలిగిన ప్రైవేటు కంపెనీలకు వాటా అది కూడా మెజారిటీ వాటా ఉండడానికి ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. జిఎస్‌టి వసూలులో ముఖ్యపాత్ర డాటా సేకరించే వారిదేనని, అది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లోనే ఉండాలని, ఎలక్ట్రానిక్స్ డిపార్ట్‌మెంట్ ద్వారా ప్రభుత్వమే ఈ పనిచేయవచ్చని స్వామి తన లేఖలో వివరించారు.