బిజినెస్

వచ్చే నెల 29న భారీ స్పెక్ట్రమ్ వేలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 8: వచ్చే నెల 29న భారీ స్పెక్ట్రమ్ వేలానికి తెరదీస్తోంది కేంద్ర ప్రభుత్వం. మునుపెన్నడూ లేనివిధంగా 5.63 లక్షల కోట్ల రూపాయల స్పెక్ట్రమ్‌ను ఈ వేలంలో పెడుతోంది. టెలికామ్ సేవల నాణ్యతను పెంచడంలో ఈ భారీ స్పెక్ట్రమ్ వేలం దోహదపడగలదని సోమవారం దరఖాస్తు ఆహ్వాన ప్రకటన విడుదల సందర్భంగా టెలికామ్ శాఖ కార్యదర్శి జెఎస్ దీపఖ్ అన్నారు. అన్ని శ్రేణుల్లో కలిపి మొత్తం 2,354.55 మెగాహెట్జ్‌ల మొబైల్ తరంగాలను ఈ వేలంలో విక్రయించనున్నారు. దీని విలువ 5.63 లక్షల కోట్ల రూపాయలుగా ఉంటుందని అంచనా.