బిజినెస్

పన్ను ఎగవేతలకు కళ్లెం వేస్తుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 8: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)కు రాజ్యసభ ఆమోదం తెలిపిన నేపథ్యంలో సోమవారం లోక్‌సభ ఆమోదం కూడా లభించింది. ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ పన్ను ఎగవేతలకు జిఎస్‌టి కళ్లెం వేస్తుందన్నారు. అలాగే జిఎస్‌టి రేటు ఆమోదయోగ్యంగానే ఉంటుందని భరోసా ఇచ్చారు. మరోవైపు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి జిఎస్‌టి అమలుకాగలదన్న విశ్వాసాన్ని పరిశ్రమ వర్గాలు వ్యక్తం చేశాయి. ‘2017 ఏప్రిల్ 1 నుంచి జిఎస్‌టి ఆచరణలోకి వస్తుందని భావిస్తున్నాం.’ అని సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అన్నారు. ‘తయారీ రంగంలో ఉత్పాదక సామర్థ్యం పెరుగుతుంది. విదేశీ పెట్టుబడులను భారత్ ఇక మరింతగా ఆకర్షిస్తుంది.’ అని పిహెచ్‌డి చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మహేశ్ గుప్తా అన్నారు. ‘ఈ చారిత్రాత్మక సంస్కరణతో దేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుంది.’ అని అసోచామ్ ప్రధాన కార్యదర్శి డిఎస్ రావత్ అన్నారు. ‘అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రధాన పోటీదారు కానుంది. ఇక దేశ జిడిపి వేగాన్ని సంతరించుకుంటుంది.’ అని ఫిక్కీ అధ్యక్షుడు హర్షవర్ధన్ నియోటియా అన్నారు.