బిజినెస్

వౌలికం ‘ముందడుగు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 1: వౌలిక రంగాభివృద్ధి జూన్‌లో 5.2 శాతంగా నమోదైంది. బొగ్గు, సిమెంట్ రంగాల్లో రెండంకెల వృద్ధి ఇందుకు దోహదం చేసింది. బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంట్, విద్యుత్ రంగాలతో కూడిన ఈ వౌలిక రంగం వృద్ధిరేటు నిరుడు జూన్‌లో 3.1 శాతంగానే ఉంది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో 38 శాతం వాటా ఈ ఎనిమిది కీలక రంగాలదే. ఇదిలావుంటే ఈ ఏడాది మే నెలలో వౌలిక రంగం వృద్ధిరేటు 2.8 శాతంగానే ఉంది. కాగా, ఈ జూన్‌లో బొగ్గు ఉత్పత్తి 12 శాతానికి, సిమెంట్ తయారీ 10.3 శాతానికి పుంజుకోవడం కలిసొచ్చింది. ఎరువుల ఉత్పత్తి కూడా దాదాపు రెండంకెల చేరువలో 9.8 శాతానికి పెరిగింది. విద్యుదుత్పత్తి 8.1 శాతం, ఉక్కు ఉత్పత్తి 2.4 శాతం, రిఫైనరీ ఉత్పత్తి 3.5 శాతం పెరిగాయి. అయతే సహజ వాయువు ఉత్పత్తి 4.5 శాతం, ముడి చమురు ఉత్పత్తి 4.3 శాతం మేర పడిపోయాయి.