బిజినెస్

స్వల్పంగా పెరిగిన రాయితీ వంటగ్యాస్ ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 1: రాయితీ వంటగ్యాస్ ధర సోమవారం స్వల్పంగా పెరిగింది. సిలిండర్‌కు రూపాయి 93 పైసలు చొప్పున పెరగగా, ఈ పెరుగుదలతో ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్ ధర 421.16 రూపాయల నుంచి 423.09 రూపాయలకు చేరింది. జూలై 1న కూడా రూపాయి 98 పైసలు పెరిగినది తెలిసిందే. డీజిల్, పెట్రోల్ మాదిరిగానే వంటగ్యాస్, కిరోసిన్ ధరలపైనా రాయితీని ఎత్తివేసేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించినది తెలిసిందే. ఈ క్రమంలోనే ధరలను నెలకు 2 రూపాయల చొప్పున పెంచుతూ పోతోంది. మరోవైపు విమానయాన ఇంధనం (ఎటిఎఫ్) ధర 4.2 శాతం తగ్గింది. దీంతో ఢిల్లీలో కిలో లీటర్ ఎటిఎఫ్ ధర 2,080.5 రూపాయలు పడిపోయి 47,206.68 వద్దకు చేరింది. ఈ మేరకు చమురు సంస్థలు ప్రకటించాయి.