బిజినెస్

రూ. 30 వేల కోట్లతో సౌర విద్యుత్ పార్కులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 23: నవ్యాంధ్రలో 30 వేల కోట్ల రూపాయల వ్యయంతో సౌర విద్యుత్ పార్కులను అభివృద్ధి చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలలో నాలుగు వేల మెగవాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్ పార్కులను కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేస్తున్నారు. 2017 జూలై నాటికి రాష్ట్రంలో నాలుగు వేల మెగవాట్ల సౌర విద్యుత్ శక్తిని అందుబాటులో తీసుకురావాలని చంద్రబాబు సర్కారు నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌లో సోలార్ రంగంలో గ్లోబల్ హబ్ ఏర్పాటుకు విదేశీ కంపెనీలు కూడా తమ సంసిద్ధత తెలిపాయి. ఎన్‌టిపిసి ద్వారా ఆనంతపురం జిల్లాలోని సౌర విద్యుత్ పార్కు నుంచి మొదటి దశ కింద ఇప్పటికే 250 మెగావాట్ల విద్యుత్‌ను అందుబాటులోకి తెచ్చారు. రికార్డు స్థాయిలో కేవలం పది నెలల్లోనే దీనిని అభివృద్ధి పరిచారు. రెండవ దశలో 2017 మార్చి నాటికి మరో 750 మెగావాట్ల విద్యుత్‌ను అందుబాటులోకి తేనున్నారు. ఇదే జిల్లా తాడిపత్రిలో ఎపి జెన్‌కో ఆధ్వర్యంలో 500 మెగావాట్ల సోలార్ పార్కు ఏర్పాటు కానున్నది, కర్నూలు జిల్లాలో వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ విద్యుత్ పార్కును నెలకొల్పనున్నారు. ఎన్‌వివిఎల్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును ఎస్‌బి ఎనర్జీ, సన్ ఎడిసన్, అజూర్ పవర్, అదాని గ్రూపు చేపడుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లోనే ఇక్కడ ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కడప జిల్లాలోని గాలివీడులో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 500 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును చేపడుతుంది. ఇదే జిల్లాలో మైలవరంలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 1,500 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్నారు. ఈ రెం డు ప్రాజెక్టులు వచ్చే ఏడాది ఆగస్టు నాటికి ఉత్పత్తి ప్రారంభించే అవకాశం ఉంది. దేశంలోనే మొదటిసారిగా 100 మెగావాట్ల సామర్థ్యంగల సౌరవిద్యుత్ నిల్వ యూనిట్లను కడప జిల్లాలో ప్రయోగాత్మకంగా నెలకొల్పనున్నారు. సౌర విద్యుత్ పంపు సెట్ల పథకంలో భాగంగా 5,013 పంపు సెంట్లు బిగించి దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. రానున్న మూడేళ్ళ కాలంలో ఏడాదికి పది వేల చొప్పున 30 వేల పంపు సెట్లు బిగించనున్నారు.