బిజినెస్
నేటి నుంచి ఐడిబిఐ బ్యాంక్ సమ్మె
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 28 March 2016
ముంబయి, మార్చి 27: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ ఐడిబిఐకి చెందిన రెండు ఉద్యోగ సంఘాలు సోమవారం నుంచి నాలుగు రోజులపాటు సమ్మెకు దిగుతున్నాయి. బ్యాంక్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ ఐడిబిఐ అధికారుల సంఘం, యునైటెడ్ ప్లాట్ఫామ్ ఆఫ్ ఐడిబిఐ బ్యాంక్ యూనియన్ 28 నుంచి 31 వరకు ఆందోళన చేస్తున్నాయి. యునైటెడ్ ఫోరమ్ ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చినప్పటికీ, యునైటెడ్ ప్లాట్ఫామ్ మార్చి 31 వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఐడిబిఐ బ్యాంక్లో దాదాపు 17,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.