బిజినెస్
ఏపి, హైదరాబాద్ మార్కెట్లలో హార్లే ఫుడ్ ఉత్పత్తులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్, మార్చి 25: గుజరాత్‌కు చెందిన హార్లే ఫుడ్ ఉత్పత్తుల సంస్థ నాణ్యత, నోరూరించే ఆరోగ్యకరమైన స్నాక్స్, బేవరేజస్, కనె్ఫక్షనరీ ఉత్పత్తులను హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ మార్కెట్లలో ప్రవేశపెట్టింది. ఆ సంస్ధ సిఎండి సౌమిక్ మిత్రా మాట్లాడుతూ పిల్లల సంతృప్తే మా సంతృప్తి అనే నినాదాన్ని టాగ్‌లైన్‌గా సూరత్ కేంద్రంగా తమ సంస్థ పనిచేస్తోందన్నారు. ప్రస్తుతం ఐదు రూపాయల ప్యాక్ విభాగంలో నమ్కీనన్, కుర్కురే ఉత్పత్తులను అందిస్తున్నట్లు చెప్పారు. త్వరలో పది రూపాయల ప్యాక్ విభాగం, ఫ్యామిలీ ప్యాక్‌లను ప్రారంభిస్తామన్నారు.
భారత్‌కు అక్రమ ఔట్సోర్సింగ్
భారీ జరిమానా
న్యూయార్క్, మార్చి 25: భారత్‌కు చెందిన ఓ సబ్ కాంట్రాక్టర్‌కు ప్రభుత్వ నిధులతో చేస్తున్న పనిని అక్రమంగా ఔట్సోర్సింగ్ ఇచ్చినందుకు అమెరికా కాంట్రాక్టర్‌కు 3.1 మిలియన్ డాలర్ల భారీ జరిమానా పడింది. 2008-09లో ముంబయకి చెందిన సంస్థకు ఫోకస్డ్ టెక్నాలజీస్ ఇమేజింగ్ సర్వీసెస్ న్యూయార్క్ చట్టాలను మీరి ఔట్సోర్సింగ్ ఇచ్చినట్లు తేలింది.