బిజినెస్

డబుల్ ధమాకా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జిడిపి దూకుడు
న్యూఢిల్లీ, మే 31: గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ జనవరి- మార్చిలో దేశ జిడిపి వృద్ధిరేటు 7.9 శాతానికి పెరిగింది. దీంతో అత్యంత వేగవంతమైన వృద్ధిరేటు కలిగిన దేశాల్లో భారత్ మరో మెట్టెక్కింది. మంగళవారం కేంద్ర గణాంకాల కార్యాలయం విడుదల చేసిన వివరాల ప్రకారం కీలకమైన తయారీ, వ్యవసాయ రంగాల్లో వృద్ధిరేటు వరుసగా 9.3 శాతం, 2.3 శాతంగా నమోదైంది. ఇకపోతే దాదాపు 8 శాతంగా వృద్ధిరేటు నమోదు కావడంపట్ల నీతి ఆయోగ్ చైర్మన్ అర్వింద్ పనగరియతోపాటు ఫిక్కీ, సిఐఐ ఆనందం వ్యక్తం చేశాయి. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తి కాంతదాస్ మున్ముం దు మరిన్ని సంస్కరణలుం టాయన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందిస్తూ ఈ ఆర్థిక సంవత్సరం జిడిపి వృద్ధి 8 శాతానికి పెరుగుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. గత ఆర్థిక సంవత్సరం మొత్తంగా వృద్ధిరేటు 7.6 శాతానికి చేరి ఐదేళ్ల గరిష్ఠాన్ని తాకడం సంతోషకరమంది.
దూసుకెళ్లిన ‘వౌలికం’
న్యూఢిల్లీ, మే 31: జిడిపి వృద్ధిరేటు పుంజుకున్న క్రమంలో కీలకమైన వౌలికరంగాభివృద్ధి కూడా దూసుకెళ్ళింది. ఏప్రిల్ నెలలో నాలుగేళ్ల గరిష్ఠాన్ని తాకుతూ ఏకంగా 8.5 శాతంగా నమోదైంది. 2012 ఫిబ్రవరిలో 8.6 శాతంగా నమోదైయ్యాక మళ్లీ ఆ స్థాయి దరిదాపుల్లో వౌలికరంగ వృద్ధి గణాంకాలు ఉండటం ఇదే. కాగా, రిఫైనరీ, విద్యుదుత్పత్తిలో రెండంకెల వృద్ధి చోటుచేసుకోవడమే ఈసారి చెప్పుకోదగ్గ వృద్ధికి ప్రధాన కారణం. బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంట్, విద్యుత్ రంగాలను కీలక రంగాలుగా వ్యవహరిస్తున్నది తెలిసిందే. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం రిఫైనరీ వృద్ధి 17.9 శాతంగా, విద్యుదుత్పత్తి వృద్ధి 14.7 శాతంగా ఉంది. ఇదిలావుంటే నిరుడు ఏప్రిల్ నెలలో వౌలికరంగ వృద్ధి కేవలం 3 శాతంగా నమోదైంది.