బిజినెస్

మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 31: సాఫ్ట్ బ్యాంకు సిఒఒ నికేష్ అరోరాతో తెలంగాణ ఐటిశాఖ మంత్రి కె తారక రామారావు అమెరికాలో మంగళవారం భేటీ అయ్యారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణలో పెట్టుబడులు, పరిశ్రమల స్థాపన ప్రయోజనాలను వివరించారు. ఆరోరాతో కెటిఆర్ రెండు గంటల పాటు చర్చలు జరపగా, తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న వివిధ అంశాలపై ఇద్దరు అభిప్రాయాలను పంచుకున్నారు. పదిహేను రోజుల్లోనే సింగిల్ విండో ద్వారా పరిశ్రమల స్థాపనకు అనుమతులు ఇస్తున్నట్టు కెటిఆర్ తెలిపారు. పారిశ్రామిక అనుమతులకు తెలంగాణ ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన టిఎస్ ఐపాస్‌ను అరోరా అభినందించారు. కాగా, పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలో ముందు వరుసలో నిలిచేందుకు అరోరా ఈ సందర్భంగా కెటిఆర్‌కు పలు సూచనలు చేయడం గమనార్హం. టెలి కమ్యూనికేషన్, మీడియా, ఫైనాన్స్ వంటి పలు రంగాల్లో జపాన్‌కు చెందిన బహుళజాతి సంస్థ సాఫ్ట్ బ్యాంకు. సాఫ్ట్ బ్యాంక్ ఇప్పటికే బ్రాడ్ బ్యాండ్, ఇంటర్నెట్ వంటి రంగాల్లో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది. ఈ క్రమంలో తెలంగాణలో ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను కెటిఆర్ ఆరోరాకు తాజా భేటీలో వివరించారు. పారిశ్రామిక, ఐటి రంగాల్లో ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని, ఇన్నోవేషన్ రంగంలో పరిశోధనలకు ఊతం ఇచ్చే విధంగా రూపొందించిన ఇన్నోవేషన్ పాలసీ గురించి కెటిఆర్ వివరించారు. అరోరాతో సమావేశం సంతృప్తికరంగా సాగిందని, సాఫ్ట్ బ్యాంకు తెలంగాణలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని కెటిఆర్ తెలిపారు.

chitram అరోరాతో భేటీ అయన కెటిఆర్