బిజినెస్

శాంతా బయోటెక్నిక్స్ కొత్త ప్లాంట్‌లో మొదలైన వ్యాక్సిన్ల తయారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 31: ముప్పిరెడ్డిపల్లిలోగల ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)లో ఏర్పాటు చేసిన నూతన కర్మాగారంలో శాంతా బయోటెక్నిక్స్ వాణిజ్య ఉత్పత్తిని మొదలు పెట్టింది. ‘హైదరాబాద్‌కు సమీపంలోని ముప్పిరెడ్డిపల్లిలోగల సెజ్‌లో మా అనుబంధ సంస్థ శాంతా బయోటెక్నిక్స్ ఏర్పాటు చేసిన కొత్త ప్లాంట్‌లో మే 25 నుంచి వ్యాక్సిన్ల తయారీ ప్రారంభమైంది.’ అని సనోఫి వ్యాక్సిన్ల విభాగం సనోఫి పాస్‌ట్యూర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో ఇక్కడ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపింది. కాగా, 19,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 2010లో ఈ ప్లాంట్ నిర్మాణం మొదలవగా, ఇండియన్ రెగ్యులేటరీ అథారిటీస్, ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతులు దీనికి వచ్చాయి. ఇదిలావుంటే ఈ ప్లాంట్ ఏర్పాటుకు సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి సనోఫి ఇండియా లిమిటెడ్ సిఎండి శైలేష్ అయ్యంగర్ కృతజ్ఞతలు తెలిపారు. 2009లో శాంతా బయోటెక్నిక్స్‌ను సనోఫి కొనుగోలు చేసినది తెలిసిందే.