బిజినెస్

దూసుకెళ్తున్న భారతీయుల సంపద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 10: పదేళ్లలో భారతీయుల సగటు సంపద ఏకంగా 400 శాతం పెరిగింది. 2005 నుంచి 2015 మధ్య భారత్‌తోసహా చైనా, వియత్నాం, శ్రీలంక, ఫిలిప్పిన్స్ దేశాల పౌరుల సంపద 400 శాతానికిపైగా పెరిగిందని న్యూ వరల్డ్ వెల్త్ నివేదిక ఒకటి స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఐరోపా వాసుల సంపద 5 శాతం క్షీణించిందని తెలిపింది. ప్రస్తుతం ఐరోపా పౌరుల సగటు సంపద దాదాపు 86,000 అమెరికన్ డాలర్లుగా ఉంది. ఇక ఆస్ట్రేలియా పౌరుల సగటు సంపద 100 శాతానికిపైగా పెరిగితే, కెనడా పౌరుల సగటు సంపద 50 శాతానికిపైగా పెరిగింది. కాగా, పోలాండ్ వంటి తూర్పు ఐరోపా దేశాల్లో పౌరుల సంపద బాగా పెరుగుతోందని, పశ్చిమ, దక్షిణ ఐరోపా దేశాల్లో క్షీణిస్తోందని తాజా నివేదికలో తేలింది. ముఖ్యంగా జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ దేశాల పౌరుల సగటు సంపద ప్రమాదంలో పడిందన్నారు. ఆస్తులు, నగదు, ఈక్విటీ, వ్యాపార లావాదేవీల ఆధారంగా పౌరుల సగటు సంపదను గణించారు. మొత్తంగా చూస్తే యూరప్ దేశాలతో పోల్చితే ఆసియా దేశాల్లో సంపద సృష్టి పురోగమిస్తోందని, పౌరుల ఆర్థిక స్థితిగ తులు బాగున్నాయని తాజా అధ్యయనంలో న్యూ వరల్డ్ వెల్త్ స్పష్టం చేసింది.