బిజినెస్

సరిపడా నిధులు లేకుంటే ట్రేడింగ్‌కు అనుమతించేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 5: అరకొర నిధులతో వచ్చే ఏ కొత్త కమాడిటీ ఫ్యూచర్లను ట్రేడింగ్‌కు అనుమతించేది లేదని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ స్పష్టం చేసింది. నేషనల్ స్పాట్ ఎక్స్‌చేంజ్ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఇఎల్) కుంభకోణం మదుపరులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చిన నేపథ్యంలో పైవిధంగా సెబీ చైర్మన్ యుకె సిన్హా తేల్చిచెప్పారు. గురువారం ఇక్కడ జరిగిన థామ్సన్ రాయిటర్స్ రిస్క్ సమ్మిట్‌లో ఆయన పాల్గొన్నారు. దాదాపు మూడేళ్ల క్రితం 2013 జూలైలో ఎన్‌ఎస్‌ఇఎల్ కుంభకోణం జరిగినది తెలిసిదే. 5,600 కోట్ల రూపాయల మేర మదుపరులకు దీనివల్ల నష్టం వాటిల్లింది.