బిజినెస్

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 2: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 169.65 పాయింట్లు క్షీణించి 25,436.97 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 43.90 పాయింట్లు పడిపోయి 7,805.90 వద్ద నిలిచింది. ఉత్పాదక రంగ పనితీరు పేలవంగా నమోదవడం, కార్పొరేట్ సంస్థల ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతోపాటు జపాన్ స్టాక్ మార్కెట్‌లో భారీ నష్టాలు మదుపరుల కొనుగోళ్ల శక్తిని దెబ్బతీసింది. ఆసియా మార్కెట్లలో సోమవారం చైనా, హాంకాంగ్, మలేషియా, సింగపూర్, థాయిలాండ్ సూచీలు సెలవుల కారణంగా మూతబడగా, ఐరోపా మార్కెట్లలోనూ ప్రధాన సూచీలు నష్టాలకే పరిమితమయ్యాయి.