బిజినెస్

బొగ్గు ఉత్పత్తిపై భానుడి దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, మే 2: ప్రస్తుత 2016-17 ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన మొదటి మాసంలోనే సింగరేణి బొగ్గు ఉత్పత్తిపై ప్రచండ భానుడు తీవ్ర ప్రభావం చూపాడు. దీంతో ఏప్రిల్ నెల ఉత్పత్తి లక్ష్యాలను కేవలం రెండు ఏరియాలు మాత్రమే సాధించగలిగాయి. మిగిలిన తొమ్మిది ఏరియాలు లక్ష్య సాధనలో విఫలమయ్యాయి. ఏప్రిల్‌లో 51 లక్షల 30 వేల టన్నుల ఉత్పత్తి సాధించాల్సి ఉండగా, 44 లక్షల 44 వేల 986 టన్నులు మాత్రమే సాధించి 87 శాతం ఉత్పాదక రేటును సంస్థ నమోదు చేసుకుంది. బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించిన ఏరియాల్లో శ్రీరాంపూర్ ఏరియా 3 లక్షల 82 వేల 500 టన్నులకుగాను 3 లక్షల 90 వేల 997 టన్నులు సాధించి అత్యధికంగా 102 శాతం ఉత్పాదక రేటును నమోదు చేసుకుంది. తర్వాత రామగుండం-3 ఏరియా 5 లక్షల 25 వేల టన్నుల లక్ష్యానికిగాను 5 లక్షల 25 వేల 102 టన్నులతో 100 శాతం ఉత్పాదక రేటును సాధించింది. మిగిలిన ఏరియాల్లో ఇల్లెందు ఏరియా 95 శాతం, భూపాలపల్లి ఏరియా 92 శాతం, ఆడ్రియాల ప్రాజెక్టు 91 శాతం, బెల్లంపల్లి ఏరియా 91 శాతం, కొత్తగూడెం ఏరియా 86 శాతం, మణుగూరు ఏరియా 83 శాతం, రామగుండం-2 ఏరియా 82 శాతం, రామగుండం-1 ఏరియా 73 శాతం, మందమర్రి ఏరియా అత్యల్పంగా 58 శాతం ఉత్పాదక రేటును నమోదు చేసుకున్నాయి. ఏప్రిల్‌లోనే ఎండలు విజృంభించడంతో కార్మికుల హాజరు శాతం తగ్గింది. ఇదికూడా ఉత్పత్తి లక్ష్యాలను దెబ్బతీసింది. విధులకు హాజరైన కార్మికులు కూడా ప్రచండ భానుడి ప్రభావంతో ఎక్కువ ఉత్పత్తి సాధించలేకపోయారు.