బిజినెస్

1న పేదలకు ఉచిత వంటగ్యాస్ కనెక్షన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 1న పేదలకు ఉచిత వంటగ్యాస్ కనెక్షన్ల కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. 8,000 కోట్ల రూపాయల వ్యయంతో తెస్తున్న ఈ పథకం ద్వారా దేశంలోని దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఉచితంగా 5 కోట్ల ఎల్‌పిజి కనెక్షన్లను అందించనున్నారు. స్వచ్చంధంగా తమ వంటగ్యాస్ సబ్సిడీని వదులుకున్న 1.13 కోట్ల మంది నుంచి ప్రభుత్వానికి వచ్చే ఆదాయంతో ఈ పథకాన్ని నడిపించనున్నారు. కాగా, మే 1న ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా వద్ద ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకాన్ని మోదీ ప్రారంభించనున్నారు. అలాగే మే 15న గుజరాత్‌లోని దహోద్ వద్ద కూడా ఇలాంటి ఓ కార్యక్రమానే్న నిర్వహించనున్నారు. ఇదిలావుంటే స్వచ్చంధంగా ఎల్‌పిజి సబ్సిడీని వదులుకున్న వినియోగదారుల్లో 16.44 లక్షల మందితో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో ఉత్తరప్రదేశ్ (దాదాపు 13 లక్షలు), ఢిల్లీ (7.26 లక్షలు) ఉండగా, మోదీ సొంత రాష్టమ్రైన గుజరాత్‌లో 4.2 లక్షల మంది సబ్సిడీని వదులుకున్నారు. చమురు శాఖ మంత్రి ప్రధాన్ సొంత రాష్టమ్రైన ఒడిషా కూడా 1.3 లక్షల మందికే పరిమితమైంది.