బిజినెస్

భారత్‌లో ప్రభావవంతమైన బ్రాండ్ గూగుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: దేశంలో అత్యంత ప్రభావవంతమైన బ్రాండ్‌గా గూగుల్ నిలిచింది. గ్లోబల్ రిసెర్చ్ సంస్థ ఇప్సోస్ అధ్యయనం ప్రకారం ఆ తర్వాతి నాలుగు స్థానాల్లో ఫేస్‌బుక్, జిమెయిల్, మైక్రోసాఫ్ట్, సామ్‌సంగ్ ఉన్నాయి. టాప్-5లో నిలిచిన అన్ని సంస్థలు విదేశీ సంస్థలే కావడం గమనార్హం. ఇక వాట్సప్ ఆరో స్థానంలో ఉండగా, భారత్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్ ఏడో స్థానంలో నిలిచింది. అమెజాన్ ఎనిమిదో స్థానం దక్కించుకోగా, ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ, దేశీయ ప్రైవేట్‌రంగ టెలికామ్ సంస్థ ఎయిర్‌టెల్ 9,10 స్థానాల్లో ఉన్నాయి. కాగా, నిరుడు డిసెంబర్‌లో ఆస్ట్రేలియా, బెల్జియం, బ్రెజిల్, చైనా, అమెరికా, బ్రిటన్ తదితర 21 దేశాల్లో కూడా ఇలాంటి అధ్యయనానే్న ఇప్సోస్ నిర్వహించింది. 100కుపైగా బ్రాండ్ల గురించి 36,600 మంది అభిప్రాయాలను సేకరించి జాబితాను తయారు చేసింది. అయితే భారత్‌లో ఇలాంటి అధ్యయనాన్ని నిర్వహించడం ఇప్సోస్‌కు ఇదే తొలిసారి. 100కుపైగా బ్రాండ్ల గురించి ఆన్‌లైన్‌లో వెయ్యి మందికిపైగా అభిప్రాయాలను తెలుసుకుంది. అతిపెద్దదైన, సుపరిచితమైన, భారీ వ్యయం కలిగిన బ్రాండ్లనే ఈ అధ్యయనంలో ఇప్సోస్ పరిగణనలోకి తీసుకుంది.